కళ్ళు ఆరోగ్యంగా ఉండాలా? అయితే ఇవి తినండి!
సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటారు. అటువంటి కళ్ళ ఆరోగ్య విషయంలో ప్రతి ఒక్కరు కచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రస్తుతం చాలా మంది కంటి సమస్యలతో బాధపడుతూ చిన్న వయసు నుండి కళ్ళజోళ్ళు వాడాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే కంటి ఆరోగ్యం కోసం మంచి ఆహారాలను తీసుకుంటే అటువంటి ఇబ్బందులు లేకుండా కళ్ళను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు అని డైటీషియన్లు చెబుతున్నారు. మరి కంటి ఆరోగ్యం కోసం తీసుకోవలసిన ఆహారాల విషయానికి వస్తే..
క్యారెట్లు
క్యారెట్లలో బీటా కెరోటిన్ ఉంటుంది. విటమిన్ ఏ తో కూడి ఉంటుంది. ఇది మన కంటి ఆరోగ్యాన్ని బాగా మెరుగుపరుస్తుంది. ప్రతి ఒక్కరూ తమ డైట్ ప్లాన్ లో క్యారెట్ లను చేర్చుకోవడం వల్ల రేచీకటి సమస్య నుంచి బయటపడతారు. దృష్టి సమస్యలు బాగా తగ్గుతాయి.

చేపలు
చేపలలో ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్ ఉంటాయి. చేపలు రెటీనా ఆరోగ్యానికి బాగా తోడ్పడతాయి. చేపలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కంటి సమస్యల నుంచి కాపాడుకోవచ్చు.
బచ్చలి కూర
బచ్చల కూర వంటి ఆకుకూరలలో కంటి ఆరోగ్యానికి మేలు చేసే బోలెడు పోషకాలు ఉంటాయి. లుటీన్ మరియు జియాక్సంతిన్ వంటివి, కెరోటినాయిడ్స్ వంటివి బచ్చలకూరలో ఉండడం వల్ల ఇవి మన కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
గుడ్లు
కోడిగుడ్లు జింక్ యొక్క అద్భుతమైన మూలం. ఇవి కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఎంతో ఉపయోగపడతాయి. జింక్ విటమిన్ ఏ ను కాలేయం నుండి రెటీనాకు రవాణా చేయడంలో సహాయపడుతుంది. కనుక గుడ్లు కంటి ఆరోగ్యానికి దోహదం చేస్తాయి.
బ్లూ బెర్రీస్
కళ్ళు ఆరోగ్యంగా ఉండాలనుకునేవారు బ్లూ బెర్రీస్ ని కూడా తీసుకుంటే మంచిది. ఇందులో ఉండే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు కంటి ఒత్తిడిని అలసటను తగ్గించడానికి సహాయపడతాయి. ఇది కంటిలోని సున్నితమైన రక్తనాళాలను కాపాడతాయి. మీ ఆహారంలో బ్లూ బెర్రీస్ ను భాగం చేసుకుంటే మంచిది.
బ్రోకలీ
బ్రోకలీ అనేది విటమిన్ సి, లుటిన్,జియాక్సంతిన్ మరియు బీటా కెరోటిన్ యొక్క పోషకాలతో ఇది కంటి ఆరోగ్యానికి ఎంతగానో దోహదం చేస్తుంది. దృష్టి సంబంధిత సమస్యల ప్రమాదాన్ని బ్రోకలీ తగ్గిస్తుంది.
చిలకడదుంపలు
చిలకడదుంపలు బీటా కెరోటిన్ యొక్క అద్భుతమైన మూలం. ఇది మన కంటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది. చిలకడదుంపలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల అవసరమైన పోషకాహారం అందించినట్టు అవుతుంది. ఇది కంటి సమస్యలను బాగా తగ్గిస్తుంది.
బాదం పప్పు
ఇక బాదంపప్పులో విటమిన్ ఈ పుష్కలంగా ఉంటుంది. బాదంపప్పును ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల కూడా బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. దృష్టిలోపాలు తగ్గి కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications