వ్యాయామం చేయకున్నా బరువు తగ్గే సూపర్ మంత్ర ఇదే!
చాలామంది బరువు తగ్గాలని ఆశపడతారు. అయితే బరువు తగ్గడం కోసం వ్యాయామం మాత్రం చేయలేరు. వ్యాయామం చెయ్యకుండా బరువు తగ్గడం ఎలా అని తెగ సెర్చ్ చేస్తూ ఉంటారు. వ్యాయామం చేయడానికి కుదరడం లేదని, వ్యాయామం చేయలేకపోతున్నామని బాధపడేవారు బరువు తగ్గడం కోసం కొన్ని చిట్కాలను పాటిస్తే కాస్తో కూస్తో ప్రయోజనం ఉంటుంది. మరి ఆ చిట్కాలు ఏమిటో తెలుసుకుందాం.
బరువు తగ్గాలంటే ఇలా చెయ్యండి
బరువు తగ్గాలని భావించేవారు వ్యాయామం చేయకపోయినా సరే క్రమబద్ధమైన జీవితాన్ని అలవర్చుకోవాలి. ప్రతిరోజు ఉదయం సమయానికి నిద్రలేవడం, రాత్రి సమయానికి నిద్ర పోవడం చేయాలి. ఇది క్రమం తప్పకుండా సమయం ప్రకారం అలవాటు చేసుకుంటే కాస్త బరువు తగ్గడానికి వీలుంటుంది. రాత్రి ప్రశాంతంగా నిద్రపోయేవారు నిదానంగా ఆరోగ్యం మెరుగుపడటం చూస్తారు. కనుక రాత్రి నిద్ర బరువు తగ్గడంలో కీలక భూమిక పోషిస్తుంది అనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి.

ఆహారం విషయంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి
బరువు తగ్గాలని భావించేవారు ఆహారం విషయంలో తగిన జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని మాత్రమే తినాలి. ఆహారాన్ని బాగా నమిలి తినాలి. ఆహారాన్ని తీసుకునేటప్పుడు కచ్చితంగా ఏం తింటున్నాం? ఎంత తింటున్నాం? అనేది దృష్టిలో పెట్టుకొని తినాలి. బరువు తగ్గాలని భావించేవారు కూల్ డ్రింక్స్ , ఐస్ క్రీమ్స్, స్వీట్స్ వంటి వాటిని తినకుండా ఉండాలి.
వాటర్ బరువు తగ్గించటంలో కీలకం
ఇక బరువు తగ్గాలని భావించేవారు భోజనానికి అరగంట ముందు మంచినీళ్ళను తాగాలి. భోజనానికి అరగంట ముందు నీళ్లు తాగితే బరువు తగ్గడానికి ఇది సహాయపడుతుంది. ఇది మనం తీసుకునే ఆహారాన్ని తగ్గించడంలో దోహదం చేస్తుంది. నీళ్లు తాగడం ఆకలిని కూడా తగ్గిస్తుంది. కాబట్టి బరువు తగ్గడం ఈజీ అవుతుంది.
బరువు తగ్గాలంటే ఉద్యోగాలు ఇలా ఉండాలి
బరువు తగ్గాలని భావించేవారు ఎక్కువసేపు కదలకుండా కూర్చునే ఉద్యోగాలు చేయకుండా ఉంటేనే మంచిది. ఎక్కువసేపు కదలకుండా ఒకేచోట కూర్చుని ఉండగా, అప్పుడప్పుడు లేచి నడవడం, కాసేపు నిలబడి పనిచేయడం వంటి వాటిని చేయాలి. ఇలా చేస్తే ఇది బరువు తగ్గడానికి కాస్త దోహదం చేస్తుంది. ఇంకా చెప్పాలి అంటే ఇది బరువు పెరగకుండా కూడా కాపాడుతుంది. కనుక వ్యాయామం చేయలేక పోయినా ఈ విషయాలను జాగ్రత్తగా వ్యవహరించి బరువును కంట్రోల్ చేసుకోండి.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications