మీ జుట్టు సిల్కీగా పట్టులా ఉండాలా.. అయితే షాంపూ బదులు ఇవి ట్రై చెయ్యండి

జుట్టు ఆరోగ్యంగా ఉండాలని, సిల్కీగా ఉండాలని, అందంగా, ఆరోగ్యంగా కనిపించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అయితే ఇటీవల మార్కెట్లో వచ్చిన షాంపూలు జుట్టు ఆరోగ్యాన్ని పాడు చేస్తున్నాయని, వాటిల్లో ఉపయోగించే వివిధ కెమికల్స్ కారణంగా జుట్టు పొడిబారడం, జుట్టు రాలిపోవడం, తెగిపోవడం, చిట్లిపోవడం వంటి సమస్యలు వస్తున్నాయని చాలామంది భావిస్తున్నారు.

జుట్టు సంరక్షణ కోసం సహజ ప్రత్యామ్నాయాలు
ఈ క్రమంలోనే జుట్టును సంరక్షించుకోవడం కోసం సహజ ప్రత్యామ్నాయాల వైపు దృష్టి సారిస్తున్నారు. షాంపూ వినియోగించకుండా జుట్టును సిల్కీగా ఉంచుకునేలా సహజ ప్రత్యామ్నాయాలను గురించి ప్రస్తుతం తెలుసుకుందాం. మృదువైన జుట్టును పొందడానికి, జుట్టు సిల్కీగా ఉండేలా చేయడానికి మనం ఇంట్లోనే ఒక పదార్ధాన్ని తయారు చేసుకునే వినియోగిస్తే మంచిది.

Want your hair to be silky and smooth Try these instead of shampoo

దీంతో జుట్టు సిల్కీగా మారుతుంది
దానికోసం గ్లాసు నీళ్లలో ఒక స్పూన్ ఫ్లాక్స్ సీడ్స్, రెండు స్పూన్ల బియ్యం, ఒక స్పూన్ మెంతులు వేసి ఒక పది నిముషాల పాటు బాగా ఉడికించి, ఆ తర్వాత దానిని వడకట్టి అందులో ఒక విటమిన్ ఈ క్యాప్సిల్, కొంచెం అలోవెరా జెల్, బాదం నూనె లేదా ఒక స్పూన్ కొబ్బరినూనె వేసి బాగా మిక్స్ చేసి దానిని జుట్టుకు అప్లై చేస్తూ ఉంటే జుట్టు సిల్కీగా మారుతుంది.

ఇది షాంపూకు ప్రత్యామ్నాయం
అందులో సహజసిద్ధమైన శీకాయను వేసి జుట్టుకు బాగా పట్టించి, బాగా మసాజ్ చేస్తూ తలస్నానం చేస్తే మీ జుట్టు సిల్కీగా మారుతుంది. ఎటువంటి షాంపూ ఉపయోగించకుండా ఈ విధంగా జుట్టు ఆరోగ్యం కోసం సహజసిద్ధమైన ప్రత్యామ్నాయాన్ని ఎంచుకుంటే మృదువైన, పట్టు కుచ్చు లాంటి జుట్టు మీ సొంతం అవుతుంది.

మందార ఆకులు, మందార పువ్వులతో జుట్టుకు మెరుపు
ఇలా మాత్రమే కాకుండా మందార ఆకులు, మందార పువ్వులు కూడా జుట్టు మృదుత్వాన్ని పెంచడానికి ఉపయోగపడతాయి. మందార ఆకులను పేస్ట్ లా చేసి తలకు పట్టించి శీకాయతో తలస్నానం చేస్తే కూడా జుట్టు మృదువుగా మారుతుంది. మందార ఆకులు, మందార పువ్వులను కాస్త ఉడికించి దానిని వడగట్టి జుట్టుకు పట్టిస్తే కూడా జుట్టు మెరుపును సంతరించుకుంటుంది. సహజ సిద్ధంగా దొరికే ఈ పదార్థాలతో ఆరోగ్యంగా ఉండటమే కాకుండా, కుదుళ్ళలో బలోపేతం అవుతుంది. ఫలితంగా జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+