ఆరోగ్యానికి, అందానికి మంచినీళ్ళ వైద్యం.. నెలరోజుల్లో నమ్మశక్యం కాని ఫలితం!
ఆరోగ్యంగా ఉండాలని అందంగా ఉండాలని ఎవరు మాత్రం కోరుకోరు. మన సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా అందంగా లైఫ్ ను సంతోషంగా లీడ్ చేయాలని కోరుకుంటారు. అయితే ఆరోగ్యం కోసం, అందం కోసం రకరకాల ప్రయోగాలు చేస్తారు. ఆరోగ్యంగా ఉండాలనుకుంటే మంచినీళ్లతో ప్రతిరోజు చేసుకునే ఒక వైద్యం ఉందని, అది ఖచ్చితంగా చేస్తే ఆరోగ్యం అందం రెండూ వస్తాయని చెబుతున్నారు కొందరు వైద్య నిపుణులు.
గోరువెచ్చని నీళ్ళతో ఆరోగ్యం
ప్రతిరోజు ఉదయం వేడి నీళ్లను తాగడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. ప్రతిరోజు ఉదయం ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీటిని తాగితే ఆరోగ్యానికి చాలా మంచి జరుగుతుంది. ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీటిని తాగితే అది శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను కరిగించి బెల్లీ ఫ్యాట్ ను తగ్గిస్తుంది. ఉదయాన్నే ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీటిని తాగడం అలవాటుగా చేసుకుంటే శరీరంలోని టాక్సిన్స్ బయటకు వెళ్ళిపోతాయి.

వేడినీళ్ళు తాగితే ఆరోగ్యంలో మిరాకిల్స్
ప్రతిరోజు నీళ్ల వైద్యం మన జీర్ణవ్యవస్థను బలంగా మారుస్తుంది. మలబద్ధకాన్ని నివారించి మేలు చేస్తుంది. ఇక బరువును తగ్గించడంలో కూడా ఎంతో ప్రభావవంతంగా వేడి నీళ్లు పనిచేస్తాయి .శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచడం ద్వారా శక్తిని, మన చర్మ సౌందర్యాన్ని కూడా పెంచుతుంది. అలసటను తొలగించి ఉత్సాహవంతంగా ఉండేలా చేస్తుంది. వేడినీళ్లని తాగడం వల్ల ఆకలి కూడా తగ్గుతుంది.
కండరాల, నరాల ఆరోగ్యం కోసం ఇలా చెయ్యండి
ఉదయాన్నే నిద్ర లేవగానే గోరువెచ్చని నీళ్లను తాగడం మూత్రపిండాలకు కూడా మేలు చేస్తుంది. శరీరం నుండి బ్యాక్టీరియాను అదనంగా ఉన్న సోడియంను ఇది తొలగిస్తుంది. వేడి నీళ్లు తాగడం వల్ల కండరాలు బలోపేతం అవుతాయి. వేడి నీళ్లు తాగితే నొప్పులు తగ్గుతాయి. వేడి నీళ్లు తాగడం వల్ల నరాల పనితీరు పెరిగి రక్తప్రసరణ మెరుగవుతుంది.
ఈ సమస్యలకు నీళ్ళతోనే పరిష్కారం
వేడి నీళ్లు తాగడం అలవాటుగా చేసుకుంటే చర్మ సంబంధిత సమస్యలు కూడా దగ్గరకు రాకుండా ఉంటాయి. ఇలా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఇచ్చే వేడి నీటిని ఉదయాన్నే తాగడం ఒక్క నెల రోజులు ట్రై చేసి చూడండి ఆపై మీ శరీరంలో జరిగే మార్పులు మీరే గమనించండి.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications