బరువు పెరిగితే ఎముకలకు డేంజర్... జాగ్రత్త!

ఊబకాయం అనేక సమస్యలకు కారణం అవుతుంది. ఒక్కసారి బరువు పెరిగితే దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అన్ని ఇన్ని కాదు. బరువు పెరగడం వల్ల శరీరంలో అనేక కొత్త అనారోగ్య సమస్యలు గూడుకట్టుకుంటాయి. బరువుతో ఎముకలకు సమస్య వచ్చి పడుతుంది.

బరువుతో పాటు ఎముకల సమస్యలు
చాలామంది చిన్న వయసునుండే వెన్నెముక సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. అయితే దీనికి ప్రధాన కారణం వారి బరువే అని వైద్యులు చెబుతున్నారు. మన శరీరానికి వెన్నెముక ఉతాన్ని ఇస్తుంది. అధికంగా బరువు పెరిగినప్పుడు ఆ బరువు ప్రభావం ఒత్తిడిగా మారి వెన్నెముకపై పడుతుంది. అప్పుడు అది బలహీనపడుతుంది. దీని కారణంగా నడుము నొప్పి వంటి సమస్యలు వస్తాయి.

Weight gain is dangerous for bones Be careful

నడుమునొప్పికి, వెన్నెముకపై ప్రభావానికి కారణం అదే
మరీ ముఖ్యంగా ఆడవాళ్ళల్లో ఎముకలకు సంబంధించి ఆస్టియో పోరోసిస్ అనే ఎముకల వ్యాధి వస్తుంది. దీని కారణంగా ఆడవాళ్ళల్లో నడుము నొప్పి సాధారణంగా ఉంటుంది. ఇక మగవారిలో కూడా నడుపు నొప్పికి ముఖ్య కారణం అధిక బరువే. అధిక బరువు కారణంగా డిస్కులు ఒత్తిడికి గురవుతాయి. ఫలితంగా వారికి వెన్ను నొప్పి వస్తుంది వెన్నెముకలోని లోయర్ బ్యాక్ లో అధిక బరువు ప్రభావం ఎక్కువగా ఉంటుంది.

ఎముకల ధృఢత్వానికి కావాల్సిన పోషకాల లోపం
ఎక్కువగా బరువు ఉన్నప్పుడు అక్కడ దృఢత్వం తగ్గుతుంది. ఎక్కువ దూరం నడవడానికి కూడా ఇబ్బంది పడతారు. ఇక బరువు ఎక్కువగా ఉన్నవారు తక్కువ తినాలని ఆలోచన చేస్తారు. ఆహారాన్ని తక్కువ తీసుకోవడం మాత్రమే కాకుండా, పోషకాలను కూడా తక్కువగా తీసుకుంటూ ఉంటారు. ఇలా చేయడం వల్ల ఎముకల దృఢత్వానికి అవసరమయ్యే కాల్షియం, విటమిన్ డి, మెగ్నీషియం వంటివి లోపంగా మారుతుంది.

ఒబేసిటీతో ఎముకలకు డేంజర్ ఇలా.. జాగ్రత్త
ఒబేసిటీ కారణంగా శరీరాన్ని ఎక్కువగా కదిలించలేకపోవడం వల్ల ఎముకలు, కీళ్లు నొప్పులు వస్తాయి. ఎముకలు పెళుసుగా మారడానికి ఇది కూడా ఒక కారణం. ఒబేసిటీ కారణంగా ఎముకలకు సంబంధించి సమస్యలు వస్తాయి. కాబట్టి బరువు తగ్గడానికి ప్రతి రోజు ఒక క్రమ పద్ధతిలో ప్రాక్టీస్ చేయాలి. రోజు వ్యాయామం చేయడంతో పాటు క్యాల్షియం ఎక్కువగా లభించే ఆహారాన్ని తీసుకోవాలి. సమస్య తీవ్రంగా ఉంటే వైద్యులను సంప్రదించాలి.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+