పెసరపప్పుతో షుగర్, హైబీపీ, అధికబరువు సమస్యలకు చెక్.. ఇంకా ఆరోగ్య ప్రయోజనాలివే
మనిషి ఆరోగ్యాన్ని కాపాడడంలో పప్పులు చాలా కీలక భూమిక పోషిస్తాయి. అందుకే ప్రతిరోజు పప్పులు తినాలని వైద్యులు చెబుతూ ఉంటారు. అన్ని రకాల పప్పులలోనూ మన శరీరానికి కావలసిన పోషకాలు ఉంటాయి పప్పుల్లో ఉండే మాంసకృత్తులు మన శరీర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
పెసరపప్పులో పోషకాలు పుష్కలం
ఇక పప్పులలో పెసరపప్పుకున్న ప్రత్యేకత అంతా ఇంతా కాదు. పెసరపప్పు అన్ని పోషకాలను కలిగి మనిషి ఆరోగ్యాన్ని కాపాడడానికి దోహదం చేస్తుంది. పెసరపప్పులో ఫైబర్, పొటాషియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం, ఐరన్, విటమిన్ b6, నియాసిన్, థయామిన్, కాపర్, విటమిన్ సి, రైబోఫ్లెవిన్, ఫోలేట్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ప్రతిరోజు పెసరపప్పును తినడం వల్ల శరీరానికి కావలసిన విటమిన్ సి లభిస్తుంది. ఇది శరీరంలో రోగనిరోధకశక్తిని పెంచడంలో ప్రయోజనకరంగా ఉంటుంది.

పెసరపప్పుతో బరువు తగ్గుతుంది
పెసరపప్పును ప్రతిరోజు తినడం వల్ల ఇది బరువు పెరగకుండా నియంత్రిస్తుంది. జీర్ణ సమస్యలను తగ్గించి తీసుకున్న ఆహారం త్వరగా జీర్ణం అయ్యేలా చేస్తుంది. పెసరపప్పును ప్రతిరోజు తినడం వల్ల ఒత్తిడి లేదా మానసిక అనారోగ్యం తగ్గుతుంది. జీవితంలో బాగా ఒత్తిడికి గురయ్యేవారు పెసరపప్పును తింటే ఒత్తిడి నుంచి బయటపడతారు. శరీరం బాగా వీక్ గా ఉన్నప్పుడు పెసరపప్పు తింటే శరీరం బలోపేతం అవుతుంది.
డయాబెటిస్ కంట్రోల్
డయాబెటిస్ సమస్య ఉన్న వారు పెసరపప్పును తింటే డయాబెటిస్ కంట్రోల్ లోకి వస్తుంది. డయాబెటిస్ కంట్రోల్ చేసే పోషకాలు పెసరపప్పులో పుష్కలంగా ఉంటాయి. పెసరపప్పులో తక్కువ క్యాలరీలు ఉండటం వల్ల ఇది మన బరువును కంట్రోల్లో ఉంచుతుంది. ఆకలిని నియంత్రించే ఫైబర్ ఇందులో తగినంత పరిమాణంలో ఉండడం వల్ల ఊరికే తిండి మీద ఆలోచన పోదు. ఫలితంగా బరువు తగ్గుతారు.
హైబీపీ కంట్రోల్
హైబీపీని పెసరపప్పు తినడం వల్ల నియంత్రణలో పెట్టుకోవచ్చు. ప్రతిరోజు పెసరపప్పును తినడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. హృదయం ఆరోగ్యంగా ఉంటుంది. పెసరపప్పు గుండె జబ్బుల ప్రమాదాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. రక్తహీనతతో బాధపడే వారికి పెసరపప్పును తినడం వల్ల రక్తహీనత సమస్య తగ్గుతుంది. ఇలా అనేక ప్రయోజనాలు ఉన్న పెసరపప్పును ప్రతిరోజు తింటే మంచిదని వైద్యులు చెబుతున్నారు.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications