డయాబెటిస్ ఉన్న వారికి కిడ్నీలు పాడయ్యే ప్రమాదం ఎందుకు వస్తుంది?
ఈ మధ్యకాలంలో కిడ్నీలు ఫెయిల్ అవుతున్న సంఘటనలు తరచుగా జరుగుతున్నాయి. దీనికి ప్రధాన కారణం డయాబెటిస్. డయాబెటిస్ కారణంగా మూత్రపిండాలు దెబ్బతినే ప్రమాదం ఎక్కువగా ఉంది. షుగర్ వ్యాధిగ్రస్తుల్లో మూత్రపిండాల సమస్యలు అధికంగా కనిపిస్తున్నాయి. డయాబెటిస్ బాధితులు మూత్రపిండాల సమస్యల విషయంలో జాగ్రత్తగా లేకుంటే ఇబ్బంది పడాల్సి వస్తుంది.
కిడ్నీలు మన శరీరంలో చేసే పని ఇదే
కిడ్నీలు మన శరీరంలోని వ్యర్థాలను, టాక్సిన్లను ఫిల్టర్ చేసి మూత్రం ద్వారా బయటకు పంపుతాయి. అంతేకాకుండా రక్తపోటును నియంత్రిస్తాయి. కొన్నిసార్లు శరీరానికి అవసరమైన హార్మోన్లను కూడా ఉత్పత్తి చేస్తాయి. మూత్రపిండాలు చెడిపోయినప్పుడు ఈ ప్రక్రియ సక్రమంగా జరగదు. ఫలితంగా డయాలసిస్ చేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.

మధుమేహంతో కిడ్నీ సమస్యలకు లింక్
మధుమేహం బారిన పడిన వారిలో ఇన్సులిన్ తగినంత ఉత్పత్తి కాదు. ఇన్సులిన్ రక్తంలోని షుగర్ లెవెల్స్‌ను నియంత్రిస్తుంది. మధుమేహం ఉన్నవారిలో ఇన్సులిన్ తగినంతగా ఉత్పత్తి కాకపోవడం వల్ల షుగర్ లెవెల్స్ విపరీతంగా పెరిగిపోతాయి. ఇది శరీరంలోని చిన్న రక్తనాళాలను దెబ్బతీస్తుంది. దీనివల్ల వివిధ అవయవాలు సరిగ్గా పనిచేయవు. ఇది కిడ్నీలపై ప్రభావం చూపి, టాక్సిన్లను బయటకు పంపే ప్రక్రియను తగ్గిస్తుంది. దీనివల్ల నరాలు దెబ్బతింటాయి.
కిడ్నీలు దెబ్బతినకుండా ఇలా చెయ్యండి
ఒక్కోసారి మూత్రం రావటం కూడా కష్టమవుతుంది. మూత్రాన్ని ఖాళీ చేయకపోవడం వల్ల మూత్రపిండాలపై ఒత్తిడి పెరిగి యూరినరీ ఇన్ఫెక్షన్లకు దారితీస్తుంది. కనుక కిడ్నీల ఆరోగ్యం కోసం డయాబెటిస్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మధుమేహం కారణంగా కిడ్నీలు దెబ్బతినకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. రక్తంలోని షుగర్ లెవెల్స్‌ను ఎప్పుడూ అదుపులో ఉంచుకోవాలి. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ సోకితే వెంటనే వైద్యుడిని సంప్రదించి వారి సలహాలు పాటించాలి.
ఇలా చేస్తే కిడ్నీ సమస్యల నుండి రిలీఫ్
అధిక రక్తపోటు సమస్య రాకుండా జాగ్రత్త పడాలి. ధూమపానం చేయకుండా దూరంగా ఉండాలి. స్మోకింగ్ చేయడం మానుకోవడం మంచిది.పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా వాడకూడదు.మధుమేహం నియంత్రణలో ఉంచుకోవడం ద్వారా, ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడం ద్వారా కిడ్నీ సంబంధిత సమస్యలను నివారించవచ్చు.
గమనిక: ఈ కథనంలో ఇవ్వబడిన వివరాలు ఆరోగ్య నిపుణుల సూచనలు మరియు ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం అందించబడ్డాయి. ఇది కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యల విషయంలో నిర్ణయాలు తీసుకునే ముందు వైద్యులను సంప్రదించడం ఉత్తమం.
-
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్












Click it and Unblock the Notifications