Henna benefits: ఈ హెల్త్ బెనిఫిట్స్ తెలిస్తే గోరింటాకు వెతికి తెచ్చుకుని మరీ పెట్టుకుంటారు
గోరింటాకు... వర్షాకాలం వచ్చిందంటే ఆషాడ, శ్రావణ మాసంలో మహిళలు పోటీ పడి పెట్టుకుంటూ ఉంటారు. అసలు గోరింటాకుతో కలిగే ప్రయోజనాలు ఏమిటి? ఈ మాసాలలో ప్రత్యేకంగా గోరింటాకు పెట్టుకోవడం వల్ల ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి అనేది ప్రస్తుతం మనం తెలుసుకుందాం.
గోరింటాకు.. ఆరోగ్య ప్రయోజనాలు
గోరింటాకు ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలను చేకూరుస్తుంది. గోరింటాకు ఒక సహజసిద్ధమైన కూలింగ్ ఏజెంట్ లా పనిచేస్తుంది. ఈ సీజన్లో వచ్చే సీజనల్ ఇన్ఫెక్షన్ల నుండి జ్వరం, జలుబు, దగ్గు తదితర రోగాల నుంచి మనల్ని కాపాడడానికి దోహదం చేస్తుంది. మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడానికి, రక్త ప్రసరణను మెరుగుపరచడానికి, శరీరం యొక్క వేడిని తగ్గించడానికి గోరింటాకు ఎంతో బాగా దోహదం చేస్తుంది.

గోరింటాకుతో గుండెకు ఆరోగ్యం
గోరింటాకు లో ఉండే సమ్మేళనాలు మన శరీరంలో రోగనిరోధక శక్తిని బాగా పెంచుతాయి. గోరింటాకు రక్తప్రసరణను మెరుగు పరచడంతో పాటు, గుండె ఆరోగ్యాన్ని కూడా మనకు మెరుగు చేస్తుంది. ఇక చర్మ ఆరోగ్యానికి కూడా గోరింటాకు ఎంతో బాగా దోహదం చేస్తుంది. చర్మంపై వచ్చే దురదలు, దద్దుర్లు వంటి చర్మ సమస్యలకు కూడా గోరింటాకు ఒక చక్కని పరిష్కారం.
ఇన్ఫెక్షన్ ల నుండి కాపాడే గోరింటాకు
జుట్టు ఆరోగ్యాన్ని కాపాడడంలోనూ, జుట్టు బలంగా పెరగడంలోనూ, జుట్టు రాలిపోయే సమస్య నుంచి విముక్తి కల్పించడంలోనూ గోరింటాకుకి ప్రత్యేకమైన స్థానం ఉంది. వర్షాకాలంలో కాళ్లు, చేతులు ఎక్కువగా నీళ్లలో ఉండడం వల్ల కాళ్లకు చేతులకు ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంటుంది. అటువంటి చోట గోరింటాకు చాలా బాగా పనిచేస్తుంది. గోరింటాకు అరికాళ్ళ మంటను తగ్గిస్తుంది. కీళ్ల నొప్పులు ఉన్నవారికి గోరింటాకును రాయడం వల్ల కీళ్లనొప్పుల నుండి వారికి ఉపశమనం లభిస్తుంది.
చేతులు, కాళ్ల నరాలకు చల్లదనం
గోరింటాకు విత్తనాలకు విరోచనాలను తగ్గించే శక్తి ఉంది. తలనొప్పితో బాధపడేవారు మాడుకు గోరింటాకును పట్టించడం వల్ల వారికి తలనొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది. చేతులు, కాళ్లకు గోరింటాకు పెట్టుకోవడం వల్ల గోరింటాకు చేతులు, కాళ్ల నరాలకు చల్లదనాన్ని ఇచ్చి శరీరం రిలాక్స్ అవ్వడానికి ఎంతగానో దోహదం చేస్తుంది.
గోరింటాకుతో లివర్ ఆరోగ్యం
గోరింటాకు బెరడును లేదా ఆకులను నీళ్లలో నానబెట్టి దానిని తాగినట్లయితే అది మన లివర్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. గోరింటాకు నమలడం వల్ల చిగుళ్ల వ్యాధి తగ్గుతుంది. నోటిపూతకు కూడా గోరింటాకు ఒక చక్కని పరిష్కారం.












Click it and Unblock the Notifications