శీతాకాలం 'సూపర్ ఫుడ్' ఇదే!
ప్రకృతి సహజంగా కాలచక్రం తిరిగే సమయంలో వరుసగా కాలాలు వచ్చిపోతుంటాయి. అయితే వీటిల్లో శీతాకాలం వచ్చిందంటే మాత్రం ప్రజలు బెంబేలెత్తుతారు. మనది సహజంగా వేడిగా ఉండే వాతావరణం కావడంతో చలికాలాన్ని చాలావరకు భరించలేరు. జలుబు, దగ్గు లాంటివి తరుచుగా వస్తూ చికాకు పెడుతుంటాయి. వీటి నుంచి బయటపడాలంటే మంచి పోషకాలున్న ఆహారాలను తీసుకోవాలి.
చలికాలంలో జలుబు, దగ్గు వచ్చాయంటే రోగనిరోధక వ్యవస్థ బలహీనంగా ఉందని అర్థం. దీనివల్ల తరుచుగా అనేక వ్యాధుల బారిన పడుతుంటారు. ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని పోషకాహార నిపుణులు తెలియజేస్తున్నారు. శరీరాన్ని లోపలి నుంచి వెచ్చగా ఉంచుకుంటే అనారోగ్య సమస్యలను నివారించవచ్చని సూచిస్తున్నారు.

చలికాలంలో తీసుకునే ఆహారాల్లో క్యారెట్ కచ్చితంగా ఉండాలి. ఇవి ఏడాది పొడవునా లభిస్తుంటాయి. వీటిల్లో బీటా కెరోటిన్ ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. మెంతికూరలో యాంటీ ఆక్సిడెంట్లు, ఖనిజాలు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. వివిధ రకాల వంటల్లో మెంతిపొడిని ఉపయోగిస్తుంటారు. ఆవాలులో ఫోలేట్, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. కూరగాయలను తినడంవల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. కచ్చితంగా తీసుకోవాల్సినవి నువ్వులు. వీటిల్లో ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రొటీన్లు, ఖనిజాలు ఉంటాయి. నువ్వుల లడ్డూ తినొచ్చు.
పాలకూరను శీతాకాలపు సూపర్ ఫుడ్ అంటారు. ఇందులో ఐరన్, విటమిన్ ఏ, విటమిన్ సి అధికంగా ఉంటాయి. శరీరాన్ని వెచ్చగా ఉంచడంతోపాటు శరీరంలో వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. సీజనల్ గా వచ్చే వ్యాధులను తగ్గించొచ్చు. ఇవే కాకుండా అనేకరకాల కూరగాయలను ఉడికించే అవసరం లేకుండా దొండ, దోసకాయ, టమాట, బీట్ రూట్ లాంటివాటిని నేరుగా తీసుకోవాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.












Click it and Unblock the Notifications