నువ్వులు ఇచ్చే ఆరోగ్యప్రయోజనాలు తెలిస్తే నివ్వెరబోవాల్సిందే!
నువ్వులు మన శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తాయి. చలికాలంలో ముఖ్యంగా నువ్వులు తినడం చాలా మంచిదని చెబుతారు. నువ్వులు మన శరీరానికి వేడి పుట్టించడమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉండడం వల్ల చలికాలంలో దీనిని సూపర్ ఫుడ్ గా చెబుతూ ఉంటారు. నువ్వులలో ఉండే పోషకాలు మనల్ని అనేక అనారోగ్య సమస్యల నుండి కాపాడతాయి.
నువ్వులతో ఆరోగ్యం
నువ్వులలో మన శరీరానికి కావలసిన పోషకాలు పుష్కలంగా ఉంటాయి . క్యాల్షియం, పొటాషియం, జింక్, ఐరన్, మెగ్నీషియం, ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ వంటి పోషకాలతో నువ్వులు మనల్ని అనేక అనారోగ్య సమస్యల నుంచి కాపాడతాయి. ప్రతిరోజు ఒక చెంచాడు నువ్వులు తిన్నా, లేదా బెల్లంతో కలిపి ఒక నువ్వుల ఉండ చేసుకుని తిన్నా మనకు బోలెడంత ఆరోగ్యం వస్తుంది.

నువ్వులతో ఎముకలకు పుష్టి
నువ్వులలో క్యాల్షియం పుష్కలంగా ఉంటుంది. పాల కంటే అధికంగా కాల్షియం ఉన్న నువ్వులు తినడం వల్ల ఎముకలు దృఢంగా మారుతాయి. మన కీళ్ల నొప్పులు, కండరాల నొప్పుల నుండి నువ్వులు మనకు ఉపశమనం కలిగిస్తాయి. వీటిని తినడం వల్ల దంతాలకు కూడా బలం చేకూరుతుంది.
నువ్వులతో ఈ సమస్యకు చెక్
నువ్వులలో ఐరన్ పుష్కలంగా ఉండడం వల్ల ఇది రక్తహీనత సమస్యతో బాధపడే వారికి చాలా బాగా పనిచేస్తుంది. ఎవరైతే రక్తహీనతతో బాధపడతారో వారు ఒక చెంచా నువ్వులను తినడం వల్ల రక్తహీనత సమస్య నుంచి బయటపడతారు. అలాగే మన రక్తాన్ని శుద్ధి చేయడానికి కూడా నువ్వులు ఎంతో బాగా ఉపయోగపడతాయి. శరీరంలో హిమోగ్లోబిన్ లెవెల్స్ ను పెంచడానికి కూడా నువ్వులు దోహదం చేస్తాయి.
నువ్వులు ఈ సమస్యలపై చేస్తాయి పోరాటం
నువ్వులలో జింక్ పుష్కలంగా ఉండడంవల్ల మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచి మనల్ని జబ్బుల బారిన పడకుండా కాపాడుతాయి. చలికాలంలో మన శరీరం పైన దాడి చేసే అనేక ఇన్ఫెక్షన్లను రాకుండా నువ్వులు ఆపుతాయి. నువ్వులలో పొటాషియం, మెగ్నీషియం అధికంగా ఉండడం వల్ల ఇవి హైబీపీని నియంత్రిస్తాయి. వీటిలో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి మన గుండెకు ఆరోగ్యాన్ని ఇస్తాయి.
నువ్వులతో గుండె జబ్బులకు చెక్
గుండెజబ్బులు రాకుండా మనలను కాపాడుతుంది. ఇలా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నటువంటి నువ్వులను ప్రతిరోజు ఒక చెంచా తింటే చాలు, లేదా ప్రతిరోజు ఒక నువ్వుల ఉండనైనా తింటే చాలు మన ఆరోగ్యంలో వచ్చే మార్పును మనం ఇట్టే గమనించవచ్చు. అయితే నువ్వులు ఆరోగ్యాన్ని ఇస్తాయని, అతిగా నువ్వులను తింటే మాత్రం మంచిది కాదని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications