ఎంత చాట్ (టు) ప్రేమయో....
నిన్నటి వరకు ఎంత ఘాటు ప్రేమయో అన్నవాళ్లు ఇప్పుడు ఎంత చాట్ ప్రేమయో అంటున్నారు. తొలి చూపులోనే ప్రేమ వికసించి ఘాటు ప్రేమగా మారే అవకాశం లేకపోలేదని కొంత మంది నిరూపించారు. ఈ ప్రేమలు పెరిగి పెద్దవై పెళ్లికి దారి తీసి సంసారసాగరాన్ని ఈదే దాకా సాగిన కథలూ, గాధలూ ఉన్నాయి. అియతే, తొలి చాట్‌లోనే ప్రేమ పుడుతుందో లేదో తెలియదు గానీ చాట్ చేయగా, చేయగా ఎక్కడో ఒక్క మల్లె తీగలాంటి మనసు గల అమ్మాయి దొరకకపోదని సదరు చాట్ ప్రియులు సెలవిస్తున్నారు.
ఇక్కడ మనసు గురించే ఎందుకు మాట్లాడుతున్నామంటే చాట్ ప్రేమకు రూపంతో పని లేదు. కాబట్ిట ఇది చాటు ప్రేమనే కాబట్టి. ఏడేడు సముద్రాల ఆవల అమెరికాలో (అమెరికానే ఎందుకు అంటున్నామంటే మనవాళ్లందరికీ భూతల స్వర్గం అమెరికానే కాబట్టి) చాట్ చేయగా చేయగా ఏ మాయామర్మం తెలియని జోడీ దొరకవచ్చు. ఆ తర్వాత అమెరికాకు ఎగిరిపోవచ్చు. ఇదేదో మనవాళ్లకు అచ్చి వచ్చే విద్య కాదనుకున్నాం గానీ మా వాడొకడు ఈ మధ్య చాట్ ప్రేమ జ్వరం పట్టుకునే సరికి నా విశ్వాసం తప్పని తేలింది.
వాడు కంప్యూటర్ ముందు ఇరవై నాలుగు గంటలూ కూర్చుని పిచ్చి పట్టినవాడిలా చాట్ చేయడం మొదలు పెట్టాడు. తిండితిప్పలు లేవు. ఎంత బతిమిలాడినా పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోవడం లేదు. ఏమిటిరా ఇదంతా అంటే నా ప్రియురాలు బోరుబోరున కంప్యూటర్ నిండా ఏడ్చేసిందిరా అని చెప్పారు.
కన్నీరు వరదలై పారి కంప్యూటర్‌ను ముంచేస్తోందని బోరుమన్నాడు. ఆకలుండదు, దాహముండదు నీతో చాట్ చేస్తుంటే అంటూ ఖుషీఖుషీగా చాట్‌లో మునిగి తేలినవాడు ఒక్కసారి దేబిరి మొహం వేసుకుని అభినవ దేవదాసులా మారిపోయేసరికి నిజం చెప్పొద్దూ నాకు గుండె బరువెక్కింది.
మరిప్పుడేం చేద్దాంమని అడిగాను.
పెళ్లి చేసుకోవడమే దీనికి మందు అన్నాడు.
ఆ అమ్మాయిని చూశావా అని అడిగాను.
ప్రేమకు కళ్లుండవు. ప్రేమ గుడ్డిది. చూడమమెందుకు అన్నాడు.
మరి పెళ్లి ఎట్లా. ఆ అమ్మాయి ఇక్కడికి వస్తుందా, నువ్వు అక్కడికి వెళ్తావా అని అడిగా. ఆ అమ్మాయి అమెరికాలోని న్యూజెర్సీలోనో ఎక్కడో ఉంటుందట.
పెళ్లయ్యాక నేనే అక్కడికి వెళ్తా అన్నాడు.
నేనో ఆడబొమ్మను తయారు చేయించి (కంప్యూటర్‌లో ఫొటోలో ఆకారం మాదిరిగా) ఆ బొమ్మకు తాళి కడతా. అదే సమయంలో ఆ అమ్మాయి ఒక మగబొమ్మకు మెడలో పూలదండ వేస్తుంది. దీంతో పెళ్లి అయిపోయినట్లే అని వివరించాడు కూడా.
ఈ మాత్రం దానికి కంప్యూటర్ ఏడ్పులు ఎందుకు అని అడిగా చిరాగ్గా.
ఏ కష్టాలు లేకుండా ప్రేమ సఫలమైతే అది ప్రేమ ఎట్లా అవుతుంది. ఇన్ని సినిమాలు చూశావు. నీకు ఆ మాత్రం తెలియదా అని ఎదురు ప్రశ్నలు వేశాడు.
వీళ్ల ప్రేమ మూడు డాలర్లు, ఆరు రూపాయలుగా ( 150 రూపాయలుగా) వర్ధిల్లాలని ఆశించడం తప్ప ఏం చేయగలం. వీడి ముఖం ఆ అమ్మాయి ప్రత్యక్షంగా చూడలేదు. ఇద్దరూ ఫొటోలు చూసుకోవడమే గానీ ఒకరినొకరు తెలుసుకున్న పాపాన పోలేదు. ఈ పెళ్లి ఎంత కాలం నిలుస్తుందో ఎవరైనా చెప్పగలరా.












Click it and Unblock the Notifications