ఏమైనా హానికరమైన పదార్థాలుంటే...
పెళ్లయిన తర్వాత అత్తవారింటికి సాగనంపుతూ తల్లి కూతురికి బుద్ధులూ జాగ్రత్తలూ చెబుతోంది.
"ముందు భర్తకు వడ్డించి, ఆయన తిన్న తర్వాత నువ్వు తినడం అలవాటు చేసుకోమ్మా!" అని చెప్పింది తల్లి
"తెలిసిందమ్మా... ఏమైనా హానికరమైన పదార్థాలు ఉంటాయేమో నాకు తెలిసిపోతుంది కదా.." అంది కూతురు
.... .... ....
గొడవ చేస్తున్న పిల్లలను చూసి ఓ ముసలాయన... "ఏమిట్రా స్కూల్ లేదా..." అని అడిగాడు.
"ఎందుకు లేదు.. ఉంది...." అన్నాడు ఓ కొంటె కుర్రాడు
"మరి ఎందుకు వెళ్లలేదూ..." అడిగాడు వృద్ధుడు
"స్కూల్‌కు సెలవు..." చెప్పాడతను
"నేను అదే అడిగాను కదరా..."
"స్కూల్ లేకపోవడానికి ఎక్కడికైనా వెళ్లిపోతుందా.." అన్నాడు ఆ కొంటె కుర్రాడు












Click it and Unblock the Notifications