మాటి మాటికి ఎందుకలా..
తన కింది ఉద్యోగి బాస్ వద్దకు నిమిషాకోసారి వచ్చి చూసి "బాగున్నారా, సార్" అని అడిగి వెళ్లి పోతున్నాడు. బాస్‌కు కోపం వచ్చింది.
"ఏమిటి.. మాటిమాటికీ అలా వచ్చి బాగున్నారా అని అడగుతున్నావు... పనేం లేదా..?"అని అన్నాడు బాస్.
"ఇంతకు ముందు టీవీ చూశాను, సార్.. దేశంలో నిమిషానికి ఒకరు చచ్చిపోతున్నారని వార్త వచ్చింది.. అందుకని.." చెప్పాడు ఉద్యోగి.
.... ........ .......
"నేనో హారర్ స్టోరీ రాశాను, సార్.. వింటే వెంట్రుకలు నిక్కబొడుచుకుంటాయి" అని అన్నాడు సినీ రచయిత బాగోతం దర్శకుడు ధర్మదానంతో.
"నీ స్టోరీ ఏదో తల మీద వెంట్రుకులన్నవాడికి చెప్పు. నాకు తల మీద వెంట్రుకలే లేవు" అన్నాడు దర్శకుడు విసుగ్గా.












Click it and Unblock the Notifications