కాళ్లు బాగుంటే మంచి డ్యాన్సర్...
"ఆ రెండు బాగుంటే నువ్వు మంచి డ్యాన్సర్‌వి అయి ఉండేవాడివి" అని అంది అమ్మాయి అబ్బాయితో.
"ఏ రెండు...?" అని అడిగాడు అబ్బాయి
"నీ రెండు కాళ్లు..." చెప్పింది అమ్మాయి కూల్‌గా..
..... ..... ......
"మా అబ్బాయికి ఏ దురలవాటూ లేదు" అని సునీత పక్కింటి తాయారమ్మతో చెప్పింది.
"మీ వాడు సిగరెట్ తాగడా?" అడిగింది తాయారమ్మ
"లేదు" చెప్పింది సునీత
"మందు తాగుతాడా?" అడిగింది చెప్పింది.
"అసలే తాగడు" చెప్పింది సునీత
"ఇంటికి ఆలస్యంగా వస్తాడా..?" మరో ప్రశ్న వేసింది తాయారమ్మ
"అసలు ఇల్లే కదలడు" చెప్పింది సునీత
"మీ వాడి వయస్సు ఎంత?" అని అడిగింది తాయారమ్మ కాస్తా ఉత్సుకతతో.
"ఈ ఉగాది వస్తే ఆరు నెలలు" చెప్పింది సునీత.












Click it and Unblock the Notifications