అతని భార్య మాట్లాడుతోందట
టెలిఫోన్ బూత్‌లో ఓ వ్యక్తి రిసీవర్ చెవి వద్ద పట్టుకుని ఏమీ మాట్లాడడం లేదు.
మరో వ్యక్తి అతను ఫోన్ చేయడం అయిపోగానే తాను ఫోన్ చేయాలని తొందరపడుతుంటాడు. రిసీవర్‌ను మొదటి వ్యక్తి ఎంతకి పెట్టేయకపోవడంతో రెండో వ్యక్తికి కోపం వస్తుంది. దాంతో అతను లోనికి చోరబడుతాడు.
రెండో వ్యక్తి: ఏమండీ.. ఊరికే రిసీవర్ పట్టుకున్నారు. ఏమీ మాట్లాడడం లేదు. నెంబర్ కలవకపోతే నాకు ఇవ్వవచ్చు కదా.. నేను ఫోన్ చేసుకుని వెళ్లిపోయిన తర్వాత నువ్వు చేసుకోవచ్చు కదా.. టైం వేస్ట్ చేస్తున్నావు.
మొదటి వ్యక్తి: ఆగవయ్యా.. మొగుడా... అవతల నా భార్య మాట్లాడుతోంది.
........ ......... ......
రాకేష్: నాకు రైల్లో నిద్ర పట్టలేదురా...
సురేష్: ఎందుకు...
రాకేష్: అప్పర్ బర్త్ వచ్చింది..
సురేష్: ఎవరితోనైనా ఎక్స్‌చేంజ్ చేసుకోలేకపోయావా...
రాకేష్: చేసుకుందామంటే కింది బెర్త్‌లో ఎవరూ లేరు..












Click it and Unblock the Notifications