దొంగ వెధలను అలాగే చూస్తోందట
రాము: సార్... మీరు ఏమీ అనుకోకపోతే ఓ మాట..
సుబ్బారావు: చెప్పవోయి.. జంకుతావెందుకు...
రాము: నిన్న మీ ఇంట్లో నేను కూర్చున్నానా... నేను కూర్చున్నంత సేపూ మీ అమ్మాయి నా వైపు కన్నార్పకుండా చూస్తూ ఉండిపోయింది...
సుబ్బారావు: దొంగ వెధవలు ఎవరైనా కనిపిస్తే ఓ కన్నేసి ఉంచాలని నేనే చెప్పాలేవోయి..
......... ....... .........
టీచర్: గాంధీ తాత గురించి నాలుగు మాటల్లో చెప్పరా...
విద్యార్థి బిక్కమొహం వేసి ఏం చెప్పలేకపోయాడు.
టీచర్: గాంధీ తాత గురించి చెప్పాలని అడిగితే బిక్క మొహం వేస్తావేంరా..
విద్యార్థి: గాంధీ గురించి తెలుసు గానీ ఆయన తాత గురించి నాకేమీ తెలియదు, టీచర్..












Click it and Unblock the Notifications