'నాయక్' సినిమా టికెట్ చాలు..
ఓ అభిమాని రామ్ చరణ్ తేజ నాయక్ సినిమా టికెట్ కోసం క్యూలో నిలబడ్డాడు. అతని వంతు వచ్చేసరికి హౌస్‌ఫుల్ బోర్డు పెట్టేశారు. దీంతో అతను ఆఫీసు రూంలోకి పరిగెత్తాడు.
"నేను సినిమా చూడాల్సిందే.. ఒక్క టికెట్టు ఇవ్వండి, చాలు" అని ప్రాధేయపడ్డాడు అతను.
"కుదరదయ్యా, ఒక్క కుర్చీ కూడా ఖాళీ లేదు" అని చెప్పాడు థియేటర్ మేనేజర్.
"మీరు టికెట్ ఇవ్వండి చాలు, మా ఇల్లు ఇక్కడికి దగ్గరే, ఓ కుర్చీ తెచ్చేసుంటా" అని బతిమాలాడు ఆ అభిమాని.
...... .....
ఆస్పత్రి బిల్లు చూసి అశ్చర్యపోయాడు సుబ్బారావు
"ఇదేం అన్యాయమండీ... రోగితో పాటు వచ్చిన మనిషికి కూడా బిల్లు వేస్తారా, ఎక్కడైనా?" అని అన్నాడు సుబ్బారావు.
"పేషంట్ బిల్లు చూడగానే వెంట వచ్చిన వ్యక్తి స్పృహ తప్పి పడిపోయాడు. దాంతో అతనికి కూడా వైద్యం చేయాల్సి వచ్చింది, రెండు సెలైన్ బాటిల్స్ ఎక్కించారు" చెప్పాడు డాక్టర్.












Click it and Unblock the Notifications