ఇప్పుడున్న భర్తనేం చేయాలి?
అయోమయం తన మొబైల్ బిల్ కోసం టెలీఫోన్ కంపెనీ కు ఫో్న్ చేసి... "నా బిల్ ఎమౌంట్ ఎంతో చెప్తారా?" అని అడిగాడు..
"మీ కరెంట్ బిల్ స్టేటస్ కోసం 123 కి డైల్ చేయండి" అని చెప్పిందా కాల్ సెంటర్ అమ్మాయి
"నీకైమైనా బుద్ది ఉందా...నేను నా ఫోన్ బిల్ ఎమౌంట్ అడుగుతూంటే నీవు నా కరెంట్ బిల్ కనుక్కోమంటావా.." కోపంగా అరిచాడు అయోమయం.
------
"మీకు కాబోయే భర్త ధనవంతుడు..గుణవంతుడు...నీతి మంతుడై ఉంటాడు..." చెప్పాడు జ్యోతిష్యుడు మణితో..
"మరి ఇప్పుడున్న భర్తనేం చేయాలి" అని అడిగింది మణి సందేహంగా...
-------------
"ఒరేయ్.. .నాలుగు నాలుగు కలిపితే ఎనిమిది...రెండు ఆరు కలిపితే ఎనిమిది....ఐదు మూడు కలిపితే ఎనిమిది అవుతుంది...మరి పదమూడు, పదహారు కలిపితే ఎంత అవుతుంది?" అడిగింది టీచర్
"ఇది చాలా అన్యాయం టీచర్...చిన్న చిన్న ప్రశ్నలకు మీరు నమాధానం చెప్పేసి పెద్దవి నన్ను అడుగున్నారు" అంది ఉక్రోషంగా చిన్నారి.












Click it and Unblock the Notifications