వాట్ ఏ వండర్ టెక్నాలజీ?
నర్స్: సర్.. కంగ్రాట్స్ అండీ
వ్యక్తి: ఎందుకు?
నర్స్: మీ ఇంట్లో మహాలక్ష్మి పుట్టిందండీ.
వ్యక్తి: అవునా.. వాట్ ఏ వండర్. టెక్నాలజీ ఎంతగా మారిపోయింది. నా భార్య హాస్పిటల్‌లో ఉంటే బిడ్డ ఇంట్లో జన్మించిందా? గ్రేట్ టెక్నాలజీ.
-------------------------
ఉపాధ్యాయుడు: ఒరేయ్ మీరిద్దరూ పాఠశాలకు ఆలస్యంగా వచ్చారేమిటి?
వెంకట్: సర్. నా డబ్బులు పడిపోయాయి. వాటిని వెతుక్కొని వచ్చేసరికి ఆలస్యమైందండీ.
ఉపాధ్యాయుడు: మరి నీకెందుకు ఆలస్యమైంది?
రాహుల్: వెంకట్ డబ్బుల పైన కాలు పెట్టి నిలబడింది నేనే సార్.
ఉపాధ్యాయుడు: ఆ... ఆ... ఆ...












Click it and Unblock the Notifications