స్కూల్‌కు వెళ్లాల్సిందే..
ప్రొద్దు పొద్దున్నే ఓ తల్లి తన కొడుకు దుప్పటి లాగి..... "రేయ్ లేవరా...స్కూల్ కి వెళ్లే టైమైంది..లే" అంటూ కసిరింది.
"నేను వెళ్లను...ఉహూ..నేను వెళ్ళను" మళ్లీ ముసుగు తంతూ...
" ..నువ్వు స్కూల్ ఎగ్గొట్టడానికి రెండు కారణాలు చెప్పు" అందా తల్లి
"నన్ను టీచర్లు, పిల్లలు ఎవరూ ఇష్టపడటం లేదు"
"అది పెద్ద కారణం కాదు..లే ...లేచి వెళ్ళు..."
"ఉహూ..పోనీ..నేను స్కూల్ కి ఎందుకు వెళ్లాలో ఒక్క కారణం చెప్పు.." అన్నాడు తల్లితో..
"ఓకే..నీ వయస్సు ఇప్పుడు 52...నువ్వే స్కూల్ కి హెడ్ మాస్టర్ వి..నీకు వేరే దారి లేదు..వెళ్లాల్సిందే" అందా తల్లి నిట్టూరుస్తూ...
...... ..........
తింగరిరావు ఆఫీసుకి రాగానే మేనేజర్ రోజూ అతని మీద విస్కీని చిలకరించసాగాడు.
"ఎందుకిలా నా మీద విస్కీని చల్లుతున్నారు?" ఓ రోజు తింగిరిరావు మేనేజరని అడిగాడు.
"నేను మూర్ఖుడ్ని పనిలో పెట్టుకున్నానని ప్రజలు అనుకునేకంటే, తాగుబోతుని పెట్టుకున్నానని అనుకోవడం వల్ల నా పరపతి పోదని" వివరించాడు మేనేజర్.












Click it and Unblock the Notifications