ఇంకా 15రోజులు ఐశ్వర్యం, రాజయోగం ఈ రాశులవారిదే!
సెప్టెంబర్ నెలలో కొన్ని రాశులవారికి లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది. గ్రహాలు సానుకూల స్థానాలలో ఉండటం కారణంగా సెప్టెంబరు నెలంతా కొన్ని రాశులవారికి అదృష్టం తాండవిస్తుంది. ఇప్పటికే సెప్టెంబర్ మాసంలో ముఖ్య గ్రహాల సంచారం , సంయోగం ఐశ్వర్యాన్ని ఇస్తుండగా, ఇంకా 15 రోజులు ధనలక్ష్మి కటాక్షాన్ని పొందే ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం.
మేషరాశి
సెప్టెంబర్ లో మేషరాశి వారికి ఇప్పటికే బోలెడు ప్రయోజనాలు చేకూరగా, మరో 15 రోజులు అదృష్టం ప్రకాశిస్తుంది. మేషరాశి వారికి సెప్టెంబర్ నెల ఆర్ధికంగా లాభదాయకంగా ఉంటుంది. ఈ నెలలో మీరు శుభవార్తలు వింటారు.ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు వచ్చే అవకాశం ఉంది . ఆర్ధిక సమస్యలు పరిష్కరించబడతాయి . పెండింగ్ పనులు పూర్తవుతాయి.

సింహరాశి
సెప్టెంబర్ నెల అంతా సింహ రాశి వారికి లాభదాయకంగా ఉంటుంది. సింహ రాశి వారికి డబ్బు సంపాదించడానికి నూతన మార్గాలు తెరుచుకుంటాయి.. వర్తక వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. వ్యాపార విస్తరణ జరుగుతుంది.. కోర్టులో ఉన్న వివాదాలలో విజయం సాధిస్తారు. జీవిత భాగస్వామితో మంచి సమయాన్ని గడుపుతారు. ఇది వీరికి అదృష్ట సమయం.
కన్యారాశి
కన్యా రాశి వారికి సెప్టెంబర్ నెల చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో కన్య రాశి వారిపై లక్ష్మి కటాక్షం ఉంటుంది. ఆర్ధిక ఇబ్బందులు తొలగిపోయి, పెట్టిన పెట్టుబడులు లాభాలను ఇస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కన్యా రాశి వారికి కుటుంబ జీవితం సంతోష దాయకంగా ఉంటుంది.
తులారాశి
సెప్టెంబర్ నెల తులా రాశి వారికి శుభ ఫలితాలను ఇస్తుంది. ఇప్పటికే తులారాశి వారికి అనేక ప్రయోజనాలు సమకూరుతుండగా మరో 15 రోజులు వీరికి అంతా శుభమే జరుగుతుంది. వీరు ఏ పని చేసినా కలిసొస్తుంది. పెట్టిన పెట్టుబడిల పైన మంచి రాబడి వస్తుంది.త్వరలోనే మీరు కొన్ని పెద్ద విజయాలను సాధించబోతున్నారు. కుటుంబ జీవితం సంతోషదాయకంగా ఉంటుంది.
ధనుస్సు రాశి
ధనుస్సు రాశి వారికి సెప్టెంబర్ నెల ప్రయోజనాలను ఇస్తుంది.నూతన ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. ఆకస్మిక ధన లాభం వస్తుంది. వ్యాపారులు లాభపడతారు. వ్యాపారాలు చేసే వారికి ఈ సమయంలో ఆర్థిక పురోగతి ఉంటుంది. ఉద్యోగాలు చేసే వారికి ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. పెండింగ్లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి.
మీన రాశి
సెప్టెంబర్ నెల మీన రాశి వారికి అన్ని విధాలా కలిసొస్తుంది. కొత్త పనులను ఈ సమయంలో ప్రారంభిస్తే కలిసి వస్తుంది. ఉద్యోగ వ్యాపారాలు చేసేవారికి పురోగతి ఉంటుంది. ఈ సమయంలో ఆర్థికంగా మీరు నిలదొక్కుకుంటారు. మీనరాశి వారు జీవితంలో ఈ సమయంలో ఏ పని చేసినా విజయం వరిస్తుంది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications