2025లో ఈ రాశి వారు నక్కతోక తొక్కుతున్నారన్న వేణు స్వామి!
2025 సంవత్సరంలో ద్వాదశ రాశుల వారి జాతకాలను ప్రముఖ జ్యోతిష్య నిపుణుడు వేణు స్వామి వెల్లడించారు. ఇందులో భాగంగా తులా రాశి జాతకులకు ఈ సంవత్సరం ఏవిధంగా ఉండబోతుందో ఆయన వివరించారు. వేణు స్వామి జాతక అంచనా ప్రకారం తులారాశి జాతకులకు ఈ సంవత్సరం 100% సానుకూల ఫలితాలు ఉన్నాయి.
తులారాశి 2025 జాతకం ఇలా
చిత్తా మూడు, నాలుగు పాదాలు, స్వాతి ఒకటి, రెండు, మూడు, నాలుగు పాదాలు, విశాఖ ఒకటి, రెండు, మూడు పాదాలు తులా రాశి కిందకు వస్తాయి. ఇక తులా రాశి వారికి 2025 సంవత్సరంలో ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 2గా ఉంటుంది. ఈ సంవత్సరం తులా రాశి జాతకులైన విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. మీ ఉత్తీర్ణత శాతం పెరుగుతుంది.

విద్యార్థులకు సానుకూలం
విదేశాలకు వెళ్లాలనుకునే వారికి కూడా సానుకూలంగా ఉంటుంది .ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. కోరుకున్న కళాశాలలో, యూనివర్సిటీలలో సీట్లు లభిస్తాయి. విదేశాలలో ఉన్న చదువు పూర్తయిన విద్యార్థులకు కూడా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. ఇక ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు వస్తాయి.
ఉద్యోగస్తులకు, రైతులకు, రాజకీయ నాయకులకు ఇలా
ఆఫీసులో వాతావరణం సానుకూలంగా ఉంటుంది. తులా రాశి జాతకులు అయిన కళాకారులకు ఇది మంచి సమయం. రైతులకు కూడా ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. ఈ సంవత్సరం రైతులు అధిక దిగుబడులను సాధిస్తారు. రాజకీయ రంగంలో ఉన్నవారికి నామినేటెడ్ పదవులు వచ్చే అవకాశం ఉంది. క్రీడాకారులకు కూడా ఈ సంవత్సరం చాలా సానుకూలంగా ఉంది.
తులా రాశి వారికి ఇదే మైనస్
అయితే తులా రాశి వారు ఈ సంవత్సరం ఒక విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. 2025 సంవత్సరం తులా రాశి వారి
కుటుంబంలో సంచలనం నమోదు కాబోతుంది. అంటే మీ కుటుంబం మీడియాకు ఎక్కే అవకాశం ఉంది. అతిపెద్ద రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఏదో రకంగా మీడియాలో మీ పేరు చర్చనీయాంశంగా మారుతుంది.
తులా రాశి వారికి అదృష్ట సంవత్సరం
ఇది మినహాయించి తులా రాశి జాతకులకు ఈ సంవత్సరం అదృష్ట సంవత్సరంగా చెప్పవచ్చు. తులారాశి జాతకులకు ఈ సంవత్సరం ఎటువంటి పరిహారాలు కూడా అవసరం లేదు. మొత్తంగా 100% తులా రాశి జాతకులకు సానుకూలంగానే ఉంటుంది అని వేణు స్వామి వెల్లడించారు.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.
-
కుంభరాశి, మీన రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
వాస్తు ప్రకారం శనివారం రోజు ఈ పనులు చేయండి.. కలిసివస్తుంది -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
మేషరాశిలో శుక్ర సంచారం.. ఈ రాశులవారికి పండుగే!! -
శ్రీరామనవమి నాడు రెండు విశేషయోగాలు.. వీరికి ఊహించని ధనలాభం! -
ఏప్రిల్ లో బుధ గోచారంతో ఈ రాశులవారికి గడ్డుకాలం! -
today rashiphalalu:మీనరాశిలో ఆ గ్రహాల కూటమి.. మీకే సంపదల వెల్లువ! -
today rashiphalalu: నేడు వీరింటికి నడిచొచ్చేను లక్ష్మీదేవి.. తలుపులు తెరవండి! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..!












Click it and Unblock the Notifications