Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

2026లో నక్కతోక తొక్కేది వీరే.. మీరున్నారా?

త్వరలో 2026 సంవత్సరం రాబోతుంది . 2026 సంవత్సరంలో ముఖ్య గ్రహాల సంచారం కొన్ని రాశుల వారి జీవితాలలో సంతోషాలను తీసుకురాబోతుంది. 2026 మొదటి అర్ధ భాగంలో గురువు , శుక్రుడు, బుధుడు వంటి గ్రహాల సంచారం, రెండవ అర్థభాగంలో కుజుడు, సూర్యుడు వంటి గ్రహాల అనుకూలమైన సంచారం కారణంగా కొన్ని రాశుల వారికి కలిసొస్తుంది.

2026 ముఖ్య గ్రహాల సంచారం
2026 సంవత్సరం అంతా శని సంచారం అన్ని రాశుల వారి జీవితం పైన కూడా ప్రభావాన్ని చూపిస్తుంది. 2026 సంవత్సరంలో ముఖ్య గ్రహాల సంచారం కారణంగా ఏ రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. ఏ రాశుల వారి జీవితం బాగుంటుంది అనేది ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

2026 lucky zodiac signs with key planets transit are you the lucky person

మిధున రాశి
మిధునరాశి వారికి 2026 సంవత్సరం బాగా కలిసి వస్తుంది. ఈ రాశి వారికి గురువు అనుగ్రహంతో 2026లో ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. కొత్త ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది. ఈ సమయంలో ఏ పని చేసినా వీరికి కలిసి వస్తుంది. సమాజంలో గౌరవ, మర్యాదలు పెరుగుతాయి. పచ్చరంగు వస్తువులను దానం చేస్తే మిధునరాశి వారికి శుభ ఫలితాలు కలుగుతాయి. మీరు విష్ణు సహస్రనామాన్ని ప్రతిరోజు చదువుకుంటే మంచి ఫలితాలు వస్తాయి.

వృషభ రాశి
2026 సంవత్సరం వృషభ రాశి వారికి బాగా కలిసొస్తుంది. ఉద్యోగంలో మంచి మార్పులను చూస్తారు. వృషభ రాశి వారి ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. మీరు ఏ పని చేసినా ఇప్పుడు సానుకూల ఫలితాలను చూస్తారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీరు ప్రతి శుక్రవారం తులసి మొక్కకు నీళ్లు పోస్తే కలిసి వస్తుంది. వెండి ఆభరణాలు ధరించడం వీరికి శుభంగా ఉంటుంది.

వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి 2026 సంవత్సరం లాభాలను ఇస్తుంది. వృశ్చిక రాశి జాతకులు ఈ సమయంలో ఏ పని చేసినా కలిసి వస్తుంది. ఇంట్లో ఉన్న పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. వర్తక వ్యాపారాలు చేసే వారికి లాభదాయకంగా ఉంటుంది. వీరు సూర్యుడికి నీటిని సమర్పిస్తే కలిసి వస్తుంది మంగళవారం నాడు హనుమాన్ చాలీసా పారాయణ చేస్తే శుభ ఫలితాలు వస్తాయి. ఎర్ర కందిపప్పు, బెల్లం దానం చేస్తే మంచిది.

తులారాశి
2026 సంవత్సరం తులారాశి జాతకులను సంపన్నులుగా మారుస్తుంది. వీరు ఈ సమయంలో ఏ పని చేసిన విజయాలను సాధిస్తారు. ఆర్థికంగా బలోపేతం అవుతారు. గతంలో ఉన్న ఇబ్బందుల నుంచి బయటపడతారు. అనుకున్న పనులన్నీ సక్రమంగా జరుగుతాయి. వీరు శుక్రవారం నాడు బియ్యం, పెరుగు, పంచదార వంటి తెల్ల వస్తువులను దానం చేస్తే మంచి జరుగుతుంది. లక్ష్మీదేవిని ఆరాధిస్తే శుభప్రదంగా ఉంటుంది.

కుంభరాశి
2026 సంవత్సరంలో కుంభ రాశి జాతకులు మంచి ఫలితాలను చూస్తారు. ఊహించని ఆర్థిక లాభాలను పొందుతారు. కుంభ రాశి వారు శనివారం నాడు పేదలకు నువ్వులు లేదా నల్లటి వస్తువులను దానం చేస్తే మంచిది. రావి చెట్టుకు నీళ్లు పోసి ప్రదిక్షణలు చేస్తే కుంభ రాశి వారికి ఈ ఏడాది కలిసి వచ్చే అవకాశం ఉంది.

Disclaimer: ఈ కథనం జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+