200 ఏళ్ల తర్వాత 4 రాజయోగాలు.. ఈ రాశులకు అద్భత ధనయోగం
నవంబరు నెలలో రుచక రాజయోగం, హంస రాజయోగం, మాలవ్య రాజయోగం, సూర్య ఆదిత్య మంగళ రాజయోగం ఏర్పడనున్నాయి. దాదాపు 200 సంవత్సరాల తర్వాత అరుదైన ఈ నాలుగు రాజయోగాలు ఏర్పడుతున్నాయి. రెండు శతాబ్దాల తర్వాత ఈ పరిణామం చోటుచేసుకోవడంతో కొన్ని రాశులవారి ఆదాయంలో పెరుగుదల ఉంటుందని పండితులు తెలియజేస్తున్నారు. గురుడు రుచక, హంస, శుక్రుడు మాలవ్య, కుజుడు సూర్య ఆదిత్య యోగాలకు కారకులు. వీటివల్ల ఏయే రాశులకు కలిసిరానుందనే విషయాన్ని తెలుసుకుందాం.
మకర రాశి
జీవిత భాగస్వామి నుంచి సంపూర్ణ సహకారం అందుతుంది. భాగస్వామి సలహా సంప్రదింపులతో చేసే పనుల్లో విజయం లభిస్తుంది. ఆర్థికంగా కలిసివస్తుంది. ఉద్యోగస్థులకు పదోన్నతి ఉంది. సమాజంలో గౌరవం పెరగడంతోపాటు పేరు ప్రఖ్యాతులు లభిస్తాయ. కుటుంబ జీవితం సంతోషకరంగా సాగుతుంది. దీర్ఘకాలికంగా ఉన్న కోరికలన్నీ నెరవేరతాయి. ప్రేమ జీవితంలో ఉన్నవారు మాధుర్యాన్ని చవిచూస్తారు.

వృషభ రాశి
నవంబరు నెల ఈ రాశివారికి వరంలాంటిదని చెప్పొచ్చు. కొత్త ఇంటిని లేదంటే కొత్త వాహనాన్ని కొనుగోలు చేయడానికి ఇది మంచి సమయం. వ్యక్తిగత జీవితంకానీ, వృత్తిపరమైన జీవితంకానీ చాలా బాగుంటాయి. వ్యాపారస్తులకు మంచి లాభాలున్నాయి. వచ్చిన డబ్బును కొత్త వ్యాపారాల్లో పెట్టుబడిగా పెడతారు. వ్యాపారన్ని విస్తరించడానికి కూడా ఇది అనువైన సమయం. ఒకరకంగా ఈ రాశివారు ఈ నెలలో ప్రత్యేకమైన శక్తిని పొందబోతున్నారు.
తులా రాశి
పెళ్లి కానివారికి పెళ్లి కుదురుతుంది. గతంలో చిక్కుకుపోయిన డబ్బులు ఈ సమయంలో చేతికి అందుతాయి. వృత్తిలో ఉన్నవారు పై స్థాయికి చేరుకుంటారు. అదృష్టం కలిసివచ్చి అందరూ ఈ రాశివారికి మద్దతిస్తారు. ఆదాయంలో మంచి పెరుగుదలతోపాటు సంపద పెరుగుతుంది. విద్యార్థులకు మంచి మార్కులు లభిస్తాయి. అన్ని పనుల్లో విజయం సాధిస్తారు. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి మంచి ఆదాయం ప్రారంభమవుతుంది.












Click it and Unblock the Notifications