డిసెంబర్ లో బుధుడి డబుల్ సంచారంతో ఈ రాశులవారికి స్వర్ణయుగం!

వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారం, గ్రహాల సంయోగం అన్ని రాశులవారి జీవితాలపైన ప్రభావాన్ని చూపిస్తాయి. వ్యాపారానికి లాభదాయకంగా భావించే బుధుడు డిసెంబర్ మాసంలో రెండు రాశులలోకి తన సంచారాన్ని సాగించబోతున్నాడు. బుధుడు సహజంగా తార్కికం, వాదన, వ్యాపారం, తెలివితేటలు, స్నేహం, లెక్కలు మొదలైన అన్నింటికీ కారకుడిగా చెబుతారు.

బుధుడి డబుల్ సంచారం
అటువంటి బుధుడు తన గమనాన్ని మార్చుకున్నప్పుడల్లా అన్ని రాశులవారి జీవితం పైన ప్రభావం పడుతుంది.డిసెంబర్ లో ధనుస్సు మరియు వృశ్చిక రాశిలో సంచారం చేస్తాడు. బుధుడు బృహస్పతి మరియు కుజుడు రాశుల్లోకి వెళ్లడం వల్ల కొన్ని రాశుల వారికి స్వర్ణయుగం మొదలవుతుంది. మరి ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం తెలుసుకుందాం.

A golden life for these zodiac signs with Mercury double transit in December

మేష రాశి
డిసెంబర్ మాసంలో బుధుడు డబుల్ సంచారం మేష రాశి జాతకులకు సానుకూల ఫలితాలను ఇస్తుంది. బుధుడు మేషరాశిలో 9వ మరియు ఎనిమిదవ ఇళ్లలోకి ప్రవేశం చేస్తాడు. దీనివల్ల ఈ సమయంలో వీరికి అదృష్టం పెరుగుతుంది. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి. మీరు డబ్బును ఆదా చేయడంలో విజయం సాధిస్తారు. మేషరాశి జాతకుల కెరీర్ బాగుంటుంది. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది.

మకర రాశి
డిసెంబర్ మాసంలో బుధుడి డబుల్ సంచారం మకరరాశి జాతకులకు సానుకూల ఫలితాలను ఇస్తుంది. మకరరాశిలో బుధుడు 12వ మరియు 11వ గ్రహాల గుండా సంచారం చేయడం వల్ల ఈ సమయంలో వీరి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ప్రయాణాలు కలిసి వస్తాయి. చేపట్టిన ప్రాజెక్టులు విజయవంతమవుతాయి. కొత్త పెట్టుబడులు పెట్టినవారు లాభాలను చూస్తారు.మకరరాశి జాతకులకు కొన్ని శుభవార్తలు తెచ్చిపెడుతుంది. స్టాక్ మార్కెట్, స్పెక్యులేషన్, లాటరీలలో డబ్బులు పెట్టిన వారికి శుభం జరుగుతుంది.

మీన రాశి
డిసెంబర్ మాసంలో బుధుడు డబల్ సంచారం మీనరాశి జాతకులకు కలిసి వస్తుంది. బుధుడు ఈ రాశిలో కర్మ గృహం మరియు తొమ్మిదవ ఇంటిలో సంచారం చేస్తాడు. దీనివల్ల మీనరాశి జాతకులు సానుకూల ఫలితాలను పొందుతారు. ఏ పని చేసినా కలిసి వస్తుంది. వ్యాపారంలో పురోగతి ఉంటుంది. కెరీర్ బలపడుతుంది .ఉద్యోగాలు చేసేవారు ఎక్కువ డబ్బులను సంపాదిస్తారు. చాలాకాలంగా నిలిచిపోయిన ప్రాజెక్టులు ఊపందుకుంటాయి. ఇది వీరికి అదృష్ట సమయం.

Disclaimer: ఈ కథనం జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+