వాస్తు ప్రకారం ఇలా పడుకుంటే సంపద వస్తుంది!
సాధారణంగా చాలామంది అలసిపోయి వచ్చి స్నానం కూడా చేయకుండా నిద్రపోతారు. అది సరికాదు. కచ్చితంగా స్నానం చేసి నిద్రించడానికి కూడా కొన్ని నియమాలు వాస్తు శాస్త్రంలో ఉన్నాయి. ఎందుకంటే మనం నిద్ర పోయే దిశను బట్టి మనకు లాభనష్టాలు కలుగుతాయని వాస్తు నిపుణులు తెలియజేస్తున్నారు. అసలు ఏ దిక్కున నిద్రిస్తే ఏమవుతుంది? ఏ దిక్కున శాస్త్రం ప్రకారం నిద్రించాలి? అనే విషయాలను తెలుసుకుందాం.
మంచం ఎటువైపు ఉండాలి
వాస్తవానికి ఇంటి యజమాని నిద్రించే మంచం నైరుతి దిశగా ఉండాలి. దీన్ని పశ్చిమం లేదంటే దక్షిణం వైపు ఉంచడం మంచిది. అలాగే ఈ దిక్కున బరువైన ఫర్నిచర్ కూడా ఉండాలి. మంచి నిద్ర కోసం ఇది చాలా అవసరం. ప్రశాంతతను, స్థిరత్వాన్ని ఇస్తుందని నమ్మకం.

తూర్పు వైపు
ఈ దిశగా తలపెట్టి పడుకుంటే నమ్మకాలు, అభ్యాసాలు మెరుగుపడతాయి. తాత్విక ఆలోచనలు కలుగుతాయి. చాలా శుభప్రదమైన దిశ. వరుణుడు పశ్చిమం ఎదురుగా ఉంటాడు.
పశ్చిమం వైపు
ఈ దిశగా తలపెట్టి పడుకోవడం అనేది చాలా మంచిది. దైవత్వంతో కూడిన శక్తుల ప్రశంసలను ఇది సూచిస్తుంటుంది. తూర్పు దిశకు పాలకుడు ఇంద్రుడు. అతనితో ముడిపడివుండే ఈ స్థానం సూర్యుడికి నమస్కారం చేయడానికి వీలు ల్పిస్తుంది.
ఉత్తరం వైపు
మన పెద్దలు ఉత్తరంవైపు తలపెట్టి నిద్రించవద్దని సలహా ఇస్తుంటారు. ఎవరూ కూడా అత్యవసరమైతే తప్పు ఉత్తరంవైపు పడుకోరు. దీనికి కారణం ఏమిటంటే. దక్షిణ దిశకు యముడు పాలకుడు. నిద్రలో పీడకలలు రావడ, నిద్ర సరిగా పట్టకపోవడం, ఆరోగ్య సమస్యలు వస్తాయని చెబుతారు.
దక్షిణం వైపు
ఈ దిశకు ఎదురుగా ఉత్తర పాలకుడు కుబేరుడు ఉంటాడు. ఈ దిక్కున తలపెట్టి పడుకోవడం అనేది చాలా చాలా ఉత్తమం అని నమ్ముతారు. శరీరాన్ని భూ అయస్కాంత క్షేత్రంతో సమానంగా ఉంచుతుంది. సంపదనివ్వడంతోపాటు మంచి నిద్రను, శ్రేయస్సును ఇస్తుంది.












Click it and Unblock the Notifications