వాస్తు ప్రకారం ఈ జంతువులు ఇంటికి అదృష్టాన్ని మోసుకొస్తాయి!
వాస్తు ప్రకారం కొన్ని జంతువుల ఫొటోలు ఇంట్లో ఉంటే ఆ కుటుంబానికి ఎంతో శ్రేయస్కరం. డబ్బులకు లోటుండదు. ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు తలెత్తవు. పనిచేస్తున్న ప్రదేశంలో కూడా ఈ ఫొటోలు ఉంటే అద్భుతమైన పురోగతి కనపడుతుంది. సానుకూల శక్తి కూడా ప్రవహిస్తుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఉండాల్సిన ఫొటోలు ఏమిటంటే.. ఏనుగు, గుర్రం, తాబేలు, చేప.. ఇలా వాస్తు ప్రకారం ఇంట్లో ఉండాల్సిన రకరకాల జంతువుల ఫొటోల గురించి తెలుసుకుందాం.
చేపలు
ఎక్వేరియం పెట్టేటప్పుడు ఈశాన్యం వైపు పెట్టాలి. దీనివల్ల సానుకూల శక్తి ప్రవహిస్తుంది. అరోవానా, గోల్డ్ ఫిష్ వంటివి డబ్బుకు సంబంధించిన సమస్యలను తొలగిస్తాయి. కొత్త అవకాశాలు వస్తాయి.

గుర్రం
దక్షిణం వైపు గోడకు ఏడు గుర్రాలున్న ఫొటోను పెట్టడంవల్ల మంచి జరుగుతుంది. లివింగ్ రూం లేదంటే కార్యాలయంలో పెడితే బాగా కలిసివస్తుంది. సమాజంలో పేరు ప్రతిష్టలు కలుగుతాయి.
పులి లేదా సింహం
పులి లేదంటే సింహానికి సంబంధించిన పెయింటింగ్స్ పెడితే అనేక లాభాలున్నాయి. దక్షిణం లేదంటే ఆగ్నేయం వైపు ఇవి ఉంటే మంచి విజయాలను అందుకుంటారు.
ఏనుగు
ఇంట్లో ఏనుగు ఫొటో పెడుతుంటే ముఖద్వారం వైపు ఉండేలా పెట్టాలి. ఇలా ఉంటే ప్రతి పనిలో విజయం వరిస్తుంది. అదృష్టం కలిసివచ్చు అందలం ఎక్కుతారు. వెండి లేదంటే కాంస్య ఏనుగు బొమ్మను పెడితే విపరీతమైన అదృష్టం కలుగుతుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఇది ఇంటి నుంచి ప్రతికూల శక్తిని తరిమికొడుతుంది.
తాబేలు
తాబేలు బొమ్మ ఎనర్జీని నియంత్రించడంతోపాటు ఆర్థికంగా కలిసివచ్చేలా చేస్తుంది. నీటిలో ఉన్న తాబేలు అయితే అద్భుతమైన ఫలితాలుంటాయి. ఉత్తరం లేదంటే వాయువ్యం వైపు తాబేలును ఉంచాలి. దీనిల్ల ఐశ్వర్యం కలుగుతుంది. మెటల్ కానీ, క్రిస్టల్ తాబేలు కానీ ఉండొచ్చు.
పక్షులు
లివింగ్ రూమ్ తోపాటు బాల్కనీలో కూడా పక్షుల ఫొటోలను పెట్టొచ్చు. పక్షులను ఇంట్లో ఉంచేటప్పుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోను పంజరంలో ఉంచొద్దు. పక్షులంటే ప్రశాంతతకు, స్వాతంత్రంకు, సమాచారానికి ప్రతీక.












Click it and Unblock the Notifications