Vastu:వాస్తు ప్రకారం బాత్‌రూంలో ఈ వస్తువులు ఉండకూడదు.. ఒకసారి చూసుకోండి
వాస్తు ప్రకారం ఇంట్లో బాత్ రూం అనేది చాలా కీలకమైనది. ఎందుకంటే వ్యతిరేక శక్తి అక్కడే ఎక్కువగా ఉంటుంది. ఆ శక్తి ఇల్లంతా వ్యాపించకుండా ఉండాలంటే, దాన్ని బయటకు పారద్రోలాలంటే కళ్లు ఉప్పును ఒక గిన్నెలో వేసి వారం రోజులపాటు ఒక మూలన పెట్టాలి. వారం దాటగానే దాన్ని తీసేసి కొత్తది వేయాలి. అలా వారం వారం మార్చుకుంటూ రావడంవల్ల ప్రతికూల శక్తులు ఇంట్లోకి ప్రవేశించవు.
మన జీవితం సంతోషంగా సాగాలంటే ఇంటి వాతావరణం కూడా బాగుండాలి.బాత్ రూంలో కొన్ని వస్తువులను వదిలేయకూడదు.పనికిరాని వస్తువులు, దెబ్బతిన్న వస్తువులేమైనా ఉంటే వెంటనే తీసేయండి.పాడైన బ్రష్ లు, చినిగిపోయిన దుస్తులు, పాడైపోయిన చెప్పులు తీసేయాలి.అవి అలాగే ఉంటే ఇంట్లో చెడు వాతావరణం ఏర్పడుతుంది.

తడిబట్టలను ఎక్కువసేపు ఉంచకూడదు.అక్కడే, అలాగే ఉంచితే దుర్వాసనతోపాటు పరిశుభ్రత తగ్గుతుంది. విరిగిపోయిన అద్దాలంటే వెంటనే తీసేయాలి.ఇవి ఇంట్లో వ్యతిరేక శక్తులకు కారణం అవుతాయి. అద్దం పగిలిపోతే వెంటనే మార్చుకోండి.
బాత్రూమ్‌లో ఖాళీ బకెట్‌ను ఉంచకూడదు.బకెట్ లో కొంత నీరు ఉండేలా చూసుకోవాలి.కుళాయి నుంచి నీరు కారుతుంటే వెంటనే మరమ్మతు చేయించాలి.నీటి వృథాను కూడా అరికట్టినట్లవుతుంది.ఇటువంటి చిన్న చిన్న జాగ్రత్తలు ఇంటి వాతావరణాన్ని ఆహ్లాదకరంగా మారుస్తాయి.పరిశుభ్రత ఉంటే, వస్తువుల సరైన అమరిక ఉంటే కుటుంబంలో ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది.












Click it and Unblock the Notifications