వాస్తు ప్రకారం ఇంట్లో చెత్తబుట్టను ఎక్కడ పెడుతున్నారు?
వాస్తు శాస్త్రం అనేది చాలా లోతైన శాస్త్రం. నిర్మాణం నుంచి గదుల వరకు, ఇంట్లో ఉండే వస్తువుల వరకు అన్నీ వాస్తును అనుసరించే జరుగుతాయి. ఉంటాయి. అలాగే చాలామంది చెత్తబుట్టను ఎక్కడ పడితే అక్కడ పడేస్తుంటారు. లేదంటే పెడుతుంటారు. అయితే దీనికి కూడా వాస్తు ఉంటుంది. ఆ ప్రకారం అది ఎక్కడ ఉండాలి? దానివల్ల ఎటువంటి చికాకులు కలగకుండా ఉండాలంటే ఏం చేయాలనేది తెలుసుకుందాం.
గుమ్మానికి ఎదురుగా చెత్తబుట్టను పెట్టుకోవద్దు.
అసలు గుమ్మానికి ఎదురుగా ఏదీ ఉండకూడదు.
ఏది ఉన్నా అన్నీ సమస్యలే ఎదురవుతాయి.
సింహద్వారానికి ముందు స్తంభాలు, చెట్లు కూడా ఉండకూడదు.
ఆగ్నేయంలోనే చెత్త డబ్బాను పెట్టుకోవాలి.

చెత్త డబ్బా అనేది ప్రతికూల శక్తి ప్రతిరూపం.
దాన్ని తప్పుడు దిశలో అసలు పెట్టకూడదు.
ఇలా చేయడంవల్ల కుటుంబ సభ్యుల ఆర్థిక, ఆరోగ్య పరిస్థితులపై ప్రభావం పడుతుంది.
వాస్తు నిపుణులు చెబుతున్నదాని ప్రకారం చెత్తడబ్బాను దక్షిణం, నైరుతి దిశల్లో పెట్టాలి.
దీనివల్ల ప్రతికూల శక్తి పారిపోతుంది.
ఒకవేళ పడమర, వాయువ్య మూలల్లో పెడితే మానసిక ఒత్తిడి తొలగిపోతుంది.
ఆగ్నేయం మూలన పెడితే ఆందోళన తగ్గిపోతుంది.
ఈశాన్యం, తూర్పు, ఆగ్నేయం, ఉత్తరం వైపు పెట్టకూడదు.
చెత్తడబ్బాకు ఎప్పుడూ మూత ఉండాలి.
ఒకవేళ తెరిచివుంచితే ప్రతికూల శక్తి ఇంట్లోనే తిష్టవేస్తుంది.
చెత్తడబ్బా ఉండే చుట్టుపక్కల ప్రాంతాన్ని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి.
విరిగిపోయిన లేదా పగిలిన చెత్తడబ్బాలను పొరపాటున కూడా వాడకూడదు.












Click it and Unblock the Notifications