12ఏళ్ళ తర్వాత బృహస్పతి కటాక్షంతో పులిపంజా చీల్చి కోటీశ్వరులయ్యే రాశులివే!
జ్యోతిష్య శాస్త్రంలో నవగ్రహాలలో బృహస్పతికి ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. దేవతల గురువైన బృహస్పతి జ్ఞానానికి విద్యకు సంపదలకు కారకుడిగా భావిస్తారు. అటువంటి బృహస్పతి ఒక రాశి నుండి మరొక రాశికి సంచారం చేయడానికి సంవత్సర కాలం పడుతుంది. ఇలా ద్వాదశ రాశులలో బృహస్పతి సంచారం 12 సంవత్సరాల పాటు కొనసాగుతుంది. ఇక ఆ విధంగా చూస్తే 12 ఏళ్లకు ఒకసారి ఒక రాశిలోకి బృహస్పతి సంచారం సాగుతుంది.
12ఏళ్ళ తర్వాత మిధునరాశిలో బృహస్పతి
గత సంవత్సరం మే నెలలో బృహస్పతి వృషభ రాశి లోకి సంచారం చేయగా ఈ సంవత్సరం మే నెలలో బృహస్పతి మిధున రాశిలోకి సంచారం చేయబోతున్నారు. మిధున రాశిలో బృహస్పతి సంఛారం కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని ఇస్తుంది. 12 ఏళ్ల తర్వాత మిధున రాశిలో మే 14వ తేదీన బృహస్పతి సంచరించనున్న నేపథ్యంలో ముఖ్యంగా మూడు రాశుల వారు అపరిమితమైన లాభాలను పొందుతున్నారు. మరి ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం తెలుసుకుందాం.

కన్యారాశి
బృహస్పతి సంచారం కన్యారాశి జాతకులకు శుభ ఫలితాలను ఇస్తుంది. కన్యారాశిలో కర్మ స్థానంలో బృహస్పతి అడుగుపెడుతున్న కారణంగా కన్యారాశి వారికి అదృష్టం వెన్నంటే ఉంటుంది. కన్యా రాశి జాతకులు కెరీర్లో అద్భుతమైన పురోగతిని చూస్తారు. ఎంతోకాలంగా ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి మంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. కన్యా రాశి వారికి కృషికి తగిన ఫలితం ఉంటుంది. ఈ సమయంలో ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. వ్యాపారంలో భారీ లాభాలు వస్తాయి.
తులారాశి
మిధున రాశి లో బృహస్పతి సంచారం తులా రాశి జాతకులకు అదృష్టాన్ని తీసుకువస్తుంది. ఈ సమయంలో తులా రాశి వారు చేసే ప్రయత్నాలన్నీ విజయవంతమవుతాయి. వర్తక, వ్యాపారాలు చేసే వారికి కలిసివస్తుంది. జీవితంలో మార్పులు చోటు చేసుకుంటాయి. శుభకార్యాలలో పాల్గొనే అవకాశం ఉంది. తులా రాశి వారికి సమాజంలో కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. కుటుంబ సభ్యుల మధ్య బంధం బలపడుతుంది. కళా రంగంలో ఉన్న వారి ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది.
మీన రాశి
మిధున రాశిలో బృహస్పతి సంచారం మీనరాశి జాతకులకు సానుకూల ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో పూర్వీకుల నుంచి ఆస్తి ప్రయోజనాలు కలుగుతాయి. కుటుంబంలో ఉన్న వివాదాలు సమసిపోయి అందరూ కలిసిమెలిసి ఉండే అవకాశం ఉంటుంది. వర్తక వ్యాపారాలు చేసే వారికి లాభాలు వచ్చి వ్యాపారం వృద్ధి చెందుతుంది. ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటుంది. నూతన వాహనాలు, వస్తువులు కొనుగోలు చేసే వీలుంటుంది. ఈ సమయంలో తల్లితో బంధం బలపడుతుంది. మీన రాశి జాతకులు భౌతికంగానూ ఈ సమయంలో లగ్జరీగా బతుకుతారు.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications