30ఏళ్ళ తర్వాత సంసప్తక యోగం ప్రకటించింది వీరికి ఐశ్వర్య వృద్ధి!!
వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలు గమనం, గ్రహాల కలయిక కారణంగా అనేక యోగాలు ఏర్పడుతున్నాయి. కొన్ని యోగాలు శుభ యోగాలు కాగా మరికొన్ని యోగాలు అశుభ యోగాలు. సౌర వ్యవస్థలోని అన్ని గ్రహాలు ఒక నిర్దిష్ట సమయం తర్వాత తమ రాశి చక్రాన్ని మార్చుకుంటాయి. ఇక వాటి ప్రభావం అన్ని రాశుల వారి పైన ఉంటుంది. ఈసారి ఆగస్టు 16 2024న సూర్యుడు రాత్రి 7.32నిమిషాలకు సింహరాశిలో సంచారం మొదలుపెట్టాడు.
ముఖాముఖిగా సూర్యుడు, శని
30 ఏళ్ల తర్వాత శని కుంభరాశిలో సంచరిస్తున్నాడు. ఈ స్థితిలో ఈ రెండు గ్రహాలు 180 డిగ్రీల వద్ద ఉన్నప్పుడు సూర్యుడు మరియు శని ఒకదానికొకటి ఏడవ ఇంట్లో ఉంటారు. ఈ విధంగా రెండు గ్రహాలు ఉండే స్థానాన్ని బట్టి సంసప్తక యోగం ఏర్పడుతుంది. అంటే రెండు గ్రహాలు ముఖాముఖిగా వచ్చినప్పుడు ఏర్పడే జ్యోతిష్య కలయిక సంసప్తక యోగాన్ని ఏర్పరుస్తుంది. దీనివల్ల కొన్ని రాశులకు అదృష్టం కలిసి వస్తుంది.

కుంభరాశి
సంసప్తక యోగం వల్ల కుంభ రాశి వారికి గొప్ప ప్రయోజనాలు కలుగుతాయి. ఈ సమయంలో ప్రజాదరణ బాగా పెరుగుతుంది. కుంభ రాశి వారికి సమాజంలో గౌరవ ప్రతిష్టలు లభిస్తాయి. ఉద్యోగులకు ఇది అనుకూలమైన సమయం. పనిచేసే చోట అనేక విజయాలను పొందుతారు. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న సమస్యలు పరిష్కారం అవుతాయి. పెళ్ళికాని వారికి వివాహ ప్రతిపాదనలు వస్తాయి.
మేషరాశి
సంసప్తక యోగం కారణంగా మేష రాశి జాతకులకు మంచి రోజులు మొదలవుతాయి. మేష రాశి వారికి ఈ సమయంలో లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి. ఆదాయ స్థాయిలలో పెరుగుదల ఉంటుంది. నూతన ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. దీంతో మేషరాశి వారి ఆర్థిక స్థితి బలోపేతం అవుతుంది. మేష రాశి వారు ఏ పని చేసినా అనుకూలమైన ఫలితాలను పొందుతారు. జీవిత భాగస్వామితో సంతోషంగా జీవిస్తారు. పిల్లల నుండి శుభవార్తలను అందుకుంటారు.
మిధున రాశి
సంసప్తక యోగం కారణంగా మిధున రాశి వారు అదృష్టవంతులు అవుతున్నారు. మిధున రాశి జాతకులు ఈ సమయంలో ఆర్థికంగా బలంగా ఉంటారు. మీరు విదేశీయానం చేసే అవకాశం ఉంది. ఎటువంటి ఆర్థిక సంక్షోభం అయినా ఈ సమయంలో పరిష్కారం అవుతాయి. మిధున రాశి వారు ఈ సమయంలో అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవాలి. ఇళ్లు, వాహనాలు కొనుగోలు చేయడానికి ఇది సరైన సమయం. మిధున రాశి వారికి మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఉద్యోగాన్ని మార్చుకోవాలని ఆలోచించే వారికి ఇది సరైన సమయం.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications