64ఏళ్ళ తర్వాత గజకేసరి రాజయోగంతో వీరికి లాటరీ తగులుతుంది!
జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారం మరియు గ్రహాల సంయోగం కారణంగా అనేక యోగాలు ఏర్పడతాయి. కొన్ని యోగాలు కొన్ని రాశుల వారికి బ్రహ్మాండమైన ఫలితాలను ఇస్తే, మరికొన్ని యోగాలు కొన్ని రాశుల వారికి దురదృష్టకర ఫలితాలని ఇస్తాయి. 64 సంవత్సరాల తర్వాత ఆగస్టు 23వ తేదీన శనివారం అమావాస్య రోజున అత్యంత శక్తివంతమైన రాజయోగం ఏర్పడబోతోంది.
64 ఏళ్ల తర్వాత గజకేసరి రాజయోగం
64 ఏళ్ల తర్వాత ఆశ్లేష నక్షత్రంలో గజకేసరి రాజయోగం ఏర్పడుతుంది. ఈ రాజయోగం కారణంగా కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. సాధారణంగా చాలామంది అమావాస్య అంటే మంచిది కాదని భయపడుతూ ఉంటారు. కానీ ఈసారి రాబోతున్న అమావాస్య గజకేసరి రాజయోగం కారణంగా చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. గజకేసరి రాజయోగం తో అదృష్టాన్ని పొందుతున్న ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం.

వృశ్చిక రాశి
గజకేసరి రాజయోగం వృశ్చికరాశి జాతకులకు ఆర్థికంగా పురోగతిని ఇస్తుంది. ఈ సమయంలో వృశ్చిక రాశి జాతకులు ఏ పని చేసిన సానుకూల ఫలితాలను పొందుతారు. వీరు రాజకీయాలలో రాణిస్తారు. రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టిన వారికి కలిసి వస్తుంది. సోదరులతో ఏర్పడిన వివాదాలు పరిష్కారమవుతాయి. భార్య తరపు ఆస్తులు కలిసి వస్తాయి. కోర్టు కేసులలో విజయం సాధిస్తారు. బంధువులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించబడతాయి. ఇది వీరికి శుభ సమయం.
తులారాశి
గజకేసరి రాజయోగం తులా రాశి జాతకులకు అదృష్టాన్ని ఇస్తుంది. తులారాశి జాతకులు ఈ సమయంలో సానుకూల ఫలితాలను పొందుతారు. వర్తక వ్యాపారాలు చేసే వారికి కలిసి వస్తుంది. భూముల సంబంధిత లావాదేవీల్లో రాణిస్తారు. లాటరీలు తగిలే అవకాశం ఉంది. కోరుకున్న అమ్మాయితో వివాహం కుదురుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. జీవితంలో ఊహించని మార్పులు సంభవిస్తాయి.
మీన రాశి
గజకేసరి రాజయోగం మీనరాశి జాతకులకు అదృష్టాన్ని ఇస్తుంది. ఈ సమయంలో మీన రాశి వారు సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతారు. ఉద్యోగం చేసే వారికి ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు వస్తాయి. విదేశాలకు వెళ్లే అవకాశాలు ఉంటాయి. ఉన్నత విద్యను అభ్యసించే వారికి మంచి జరుగుతుంది. ఎప్పటినుండో వసూలు కానీ మొండి బాకీలు వసూలు అవుతాయి.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications