దసరా నవరాత్రుల తర్వాత ఈ రాశులవారు కుబేరులవ్వటం పక్కా!
జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. నవగ్రహాలలో బుధుడిని తెలివితేటలకు, కమ్యూనికేషన్ కు ప్రతీకగా చెబుతారు. అటువంటి బుధ గ్రహం దసరా నవరాత్రుల తర్వాత అక్టోబర్ 3వ తేదీన తన రాశిని మార్చుకోబోతున్నాడు. బుధుడి రాశి మార్పు కారణంగా కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది.
అక్టోబర్ 3న బుధ సంచారం.. అదృష్ట రాశులు
అక్టోబర్ 3వ తేదీన తెల్లవారుజామున 3 గంటల 45 నిమిషాలకు బుధుడు తన సొంత రాశి చక్రం అయిన కన్యారాశిని వదిలి, శుక్రుని రాశిచక్రమైన తులా రాశిలోకి ప్రవేశిస్తాడు. శుక్రుడు, బుధుడు స్నేహపూర్వక గ్రహాలు కాబట్టి ఈ సంచారం సాధారణంగా శుభప్రదంగా పరిగణించబడుతుంది. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం బుధ సంచారం కొన్ని రాశులవారికి అదృష్టాన్ని తీసుకువస్తుంది. ఆ అదృష్టరాశులు ఏమిటో తెలుసుకుందాం.

కర్కాటక రాశి
కర్కాటక రాశిలో బుధ సంచారం నాలుగవ ఇంట్లో జరుగుతుంది. ఈ సమయంలో కర్కాటక రాశి వారి ఆర్థిక స్థితి బలపడుతుంది. చాలాకాలంగా వసూలు కావలసిన మొండి బాకీలు వసూలు అవుతాయి. కమ్యూనికేషన్ నైపుణ్యాలు పనిలో ప్రశంసించబడతాయి. సీనియర్ల మద్దతు దొరుకుతుంది. ఏ పని చేసిన విజయం సాధిస్తారు. కుటుంబంలో శాంతి, ప్రేమ వాతావరణం ఉంటుంది. కర్కాటక రాశి జాతకులు అక్టోబర్లో నాణ్యమైన సమయాన్ని గడుపుతారు.
వృశ్చిక రాశి
వృశ్చికరాశి వారికి బుధ సంచారం కలిసివస్తుంది. వృశ్చికరాశిలో బుధుడు 12వ ఇంట్లో సంచారం చేస్తాడు. ఇది ఆధ్యాత్మికతతో ముడిపడి ఉండడం వల్ల ఈ సమయంలో వీరు ఆధ్యాత్మిక కార్యకలాపాలపైన ఎక్కువ మొగ్గుచూపుతారు. ఈ సమయంలో మానసిక ప్రశాంతత కలుగుతుంది. ఆర్థికంగా ఇది మంచి సమయం. వివిధ వనరుల నుండి ఆదాయం వస్తుంది. విదేశాలలో ఉద్యోగాలు, వ్యాపారాలు చేసే వారికి కలిసివస్తుంది. ఈ సమయంలో పెట్టిన పెట్టుబడులు దీర్ఘకాలిక ప్రయోజనాలను ఇస్తాయి.
కుంభరాశి
బుధ సంచారం కుంభరాశి వారికి అక్టోబర్లో అదృష్టాన్ని ఇస్తుంది. బుధుడు కుంభరాశిలో తొమ్మిదవ ఇంట్లో సంచారం చేస్తాడు. దీనిని అదృష్ట గృహంగా భావించటం వల్ల ఈ సమయం కుంభ రాశి వారికి అదృష్టాన్ని తెస్తుంది. ఈ సమయంలో పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి. కష్టపడి పనిచేయడం వల్ల కుంభ రాశి వారికి మంచి ఫలితం వస్తుంది. విదేశీ సంబంధిత ఉద్యోగాలు వ్యాపారాలలో గణనీయమైన లాభాలు వస్తాయి. కొంతమందికి విదేశీ ప్రయాణ అవకాశాలు కూడా వస్తాయి. మతపరమైన కార్యకలాపాల ఆసక్తి పెరుగుతుంది. మానసిక ప్రశాంతతతో పాటు, ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది.
Disclaimer: ఈ కథనం జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications