మహా శివరాత్రి తరువాత ఈ రాశులవారికి డబ్బే డబ్బు.. సుడి తిరుగుతుంది!
హిందువులు అత్యంత పవిత్రంగా జరుపుకునే పండుగలలో మహాశివరాత్రి ఒకటి. ఈ మహాశివరాత్రి పండుగను ఫాల్గుణ మాసంలోని కృష్ణపక్ష త్రయోదశినాడు జరుపుకుంటారు. ఈరోజు శివపార్వతుల కళ్యాణం జరిగిందని లోకాన్ని రక్షించేందుకు లింగోద్భవం జరిగిందని చెబుతారు. ఇక హిందువులు అత్యంత పవిత్రంగా భావించే మహాశివరాత్రి పర్వదినాన శివ భక్తులు శివుడికి అభిషేకాలు, అర్చనలు చేసి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
మహా శివరాత్రి నాడు గ్రహాల సంచారం
అయితే మహాశివరాత్రి పర్వదినం రోజు జరిగే గ్రహాల సంచారం అన్ని రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తుంది. ఇక మహాశివరాత్రి తర్వాత నుండి కొన్ని రాశుల వారికి శివుడు ప్రత్యేక అనుగ్రహం లభిస్తుంది. మహాశివరాత్రి తర్వాత ఏ రాశుల వారి పైన శివుని కటాక్షం ఉంటుందో ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

మేషరాశి
మహా శివరాత్రి తర్వాత మేష రాశి వారికి సానుకూల ఫలితాలు వస్తాయి. మహాశివరాత్రి మేష రాశి వారి జీవితంలో చాలా ప్రత్యేకమైన రోజుగా చెప్పవచ్చు ఈ సమయంలో మేషరాశి జాతకులు కెరీర్లో వృద్ధిని పొందుతారు. వర్తక వ్యాపారాలు చేసేవారు అన్ని విధాలా లాభాలను పొందుతారు. ఆరోగ్య సంబంధిత సమస్యలు తొలగిపోతాయి. మేషరాశి జాతకులకు ఇది సానుకూల సమయం.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. వృశ్చిక రాశి జాతకులు జీవితంలో ఎదురయ్యే ఇబ్బందులను సానుకూలంగా పరిష్కరించుకుంటారు. వృశ్చిక రాశి వారి సంపద పెరుగుతుంది. ఆర్థిక పురోగతిని సాధిస్తారు. శివుని అనుగ్రహంతో వృశ్చిక రాశి వారి జీవితంలో సంపద, శ్రేయస్సు పెరుగుతాయి.
మకర రాశి
మకర రాశి జాతకులు శివరాత్రి తర్వాత నుంచి జీవితంలో సానుకూల ప్రయోజనాలను పొందుతారు. ఈ సమయంలో వీరు కెరీర్ లో ఎటువంటి సమస్యలు ఎదురైనప్పటికీ వాటిని తెలివిగా పరిష్కరించుకుంటారు. మకర రాశి వారి కుటుంబ జీవితం బాగుంటుంది. శివరాత్రి రోజు శివుడికి రుద్రాభిషేకం చేయడం వలన వీరికి ఉత్తమ ఫలితాలు వస్తాయి. అనుకున్న పనులన్నీ నెరవేరుతాయి.
కుంభరాశి
శివుని యొక్క కటాక్షంతో కుంభరాశి వారికి మహాశివరాత్రి తర్వాత మంచి ప్రయోజనాలు వస్తాయి. కుంభ రాశి జాతకులు ఈ సమయంలో పనులలో పురోగతిని చూస్తారు. ఈ రాశి వారి జీవితంలో ఉన్నతమైన రోజులను చూడడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు వీరు ఉపవాసం ఉండి శివుడిని ప్రత్యేకంగా పూజించడం ద్వారా మంచి సానుకూల ఫలితాలను చూస్తారు.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications