అర్ధకేంద్ర యోగంతో ఈ రాశులవారికి డబ్బుల మూటలు!
జ్యోతిష్య శాస్త్రంలో దాదాపు 30 సంవత్సరాల సుదీర్ఘ విరామం తరువాత అర్ధ కేంద్ర యోగం ఏర్పడుతుంది. జ్యోతిష్య శాస్త్రంలో అరుదైనదిగా భావించే ఈ యోగం, కొన్ని రాశుల వారికి అద్భుతమైన ప్రయోజనాలను చేకూరుస్తుంది. ఈ ప్రత్యేక యోగం వల్ల ఏ రాశుల జీవితాల్లో సానుకూల ఫలితాలు వస్తాయో ఒకసారి తెలుసుకుందాం.
శని, కుజ గ్రహాలతో అర్థకేంద్రయోగం
శని, కుజ గ్రహాలు ఒకదానికొకటి దగ్గరగా వచ్చినప్పుడు 'అర్థ కేంద్ర యోగం' సంభవిస్తుంది. ప్రస్తుతం కుజుడు మకర రాశిలో, శని గ్రహం మీన రాశిలో సంచరిస్తున్నాయి. ఈ రెండు గ్రహాలు 45-డిగ్రీల కోణీయ సంయోగాన్ని ఏర్పరచడం కారణంగా ఈ యోగం ఏర్పడుతుంది. ఇది కుంభరాశి, మకర రాశితో పాటు కొన్ని రాశులవారికి సానుకూల ప్రయోజనాలు ఇస్తుంది.

వృషభ రాశి
వృషభ రాశి వారికి అర్ధ కేంద్ర యోగం అద్భుతమైన సమయం అవుతుంది. ఈ సమయంలో వృషభ రాశి వారికి ఆదాయంలో భారీ పెరుగుదల ఉంటుంది, అప్పుల బాధల నుండి ఉపశమనం లభిస్తుంది. వ్యక్తిగత జీవితం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇంటా బయట సంతోషం, ప్రశాంతత నెలకొంటుంది.
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి ఈ యోగం అదృష్టాన్ని చేకూర్చుతుంది. వీరు ఈ సమయంలో ఆనందకరమైన జీవితం గడుపుతారు. చేపట్టిన ప్రతి పనిలో విజయం సొంతం అవుతుంది. ఇంటా బయట సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది.
కుంభరాశి
అర్ధ కేంద్ర యోగం కుంభ రాశి వారికి ఊహించని ఆర్ధిక ప్రయోజనాలను కలిగిస్తుంది. ఈ సమయంలో కుంభరాశి వారి ఆదాయం పెరుగుతుంది, ఖర్చులు తగ్గడంతో ఆనందంగా జీవిస్తారు. కెరీర్‌లో శుభ పరిణామాలు చోటు చేసుకుని, ఇంటా బయట సంతోషం ఉంటుంది.
మకర రాశి
మకర రాశి వారికి ఈ యోగం వలన మకర రాశి వారు అనూహ్య ప్రయోజనాలు అందుకుంటారు. సంపద పెరుగుతుంది, ఆర్థికంగా కలిసి వస్తుంది. వీరు చేపట్టిన ప్రతి పనిలోనూ విజయం వరిస్తుంది. ముఖ్యంగా వ్యాపారస్తులకు అధిక లాభాలు వచ్చే అవకాశం ఉంది.
గమనిక: ఈ సమాచారం జ్యోతిష్య నిపుణులు, ఇంటర్నెట్‌లో లభించిన ఆధారంగా రూపొందించబడింది. దీనిని Oneindia ధ్రువీకరించలేదు. వ్యక్తిగత జాతకాలను బట్టి ఫలితాలు మారవచ్చు.












Click it and Unblock the Notifications