సంక్రాంతి తర్వాత లక్ష్మీ నారాయణ రాజయోగం.. వీరిపై లక్ష్మీ కటాక్షం!

వేద జ్యోతిష్యశాస్త్రం ప్రకారం గ్రహాలు నిరంతరం తమ స్థానాలు, రాశులను మారుస్తూ ఉంటాయి. నిర్దిష్ట కాలమానం ప్రకారం సంచారం చేస్తూ మానవ జీవితంపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రభావం చూపుతాయి. అలాంటి ఒక అత్యంత ముఖ్యమైన గ్రహ సంచారం 2026 జనవరి 17న జరగబోతోంది. ఆ రోజున బుధ గ్రహం ధనస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించనుంది. అదే సమయంలో శుక్ర గ్రహంతో కలిసి లక్ష్మీనారాయణ రాజయోగాన్ని ఏర్పరచనుంది.

లక్ష్మీ నారాయణ యోగంతో కొన్ని రాశుల వారికి ఆర్ధిక లాభం
ఈ లక్ష్మీ నారాయణ రాజయోగం చాలా ప్రత్యేకమైంది. ఈ యోగం ప్రభావం ద్వాదశ రాశుల వారి జీవితాలపై ఉంటుంది. బుధ శుక్రుల సంయోగం కారణంగా ఏర్పడే ఈ యోగం కారణంగా కొన్ని రాశుల వారి ఆర్ధిక స్థితి బలపడుతుంది. సంపద పెరుగుతుంది. జీవితంలో స్థిరత్వం వస్తుంది. వ్యాపారులకు లాభదాయకమైన ఒప్పందాలు కుదురుతాయి. లక్ష్మీ నారాయణ యోగంతో దాంపత్య జీవితంలో సంతోషం పెరుగుతుంది.

After Sankranthi the Lakshmi Narayana Rajayoga will occur These zodiac signs will get wealth

వృషభ రాశి
మకర రాశిలో బుధుడు శుక్రుడు కలయికతో ఏర్పడే లక్ష్మీనారాయణ రాజయోగంతో వృషభ రాశి జాతకులకు కలిసి వస్తుంది. ఈ సమయంలో ఏ పని చేసినా మంచి ఫలితం ఉంటుంది. కుటుంబ జీవితంలో సంతోషం, వ్యాపారంలో పురోగతి కనిపిస్తుంది. విద్యార్థులకు పోటీ పరీక్షల్లో విజయం లభించనుంది. మనస్సులో సంతృప్తి, ఆత్మవిశ్వాసం పెరిగే కాలంగా ఇది మారనుంది.

తులా రాశి
తులా రాశి వారికి ఈ లక్ష్మీనారాయణ యోగం కారణంగా కలిసి వస్తుంది. తులారాశి జాతకులకు బుధుడు, శుక్రుడు నాలుగో స్థానంలో సంచరించడం వల్ల కుటుంబంతో ఆనందంగా గడిపే అవకాశాలు కలుగుతాయి. కొత్త ఇల్లు లేదా ప్లాట్ కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. ప్రయాణాల ద్వారా లాభాలు పొందుతారు. తులారాశి జాతకులైన వ్యాపారస్తులకు ఆదాయం వేగంగా పెరుగుతుంది. భాగస్వామితో సంబంధాలు మరింత బలపడతాయి.

మకర రాశి
మకర రాశి వారికి లక్ష్మీనారాయణ యోగం అద్భుత ఫలితాలను ఇస్తుంది. ఉద్యోగస్తులకు పనిలో గుర్తింపు లభిస్తుంది. ఈ సమయంలో పదోన్నతులు లభిస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి. వేతన పెరుగుదలతో పాటు కెరీర్‌లో స్థిరత్వం ఏర్పడుతుంది. పూర్వీకుల ఆస్తి ద్వారా లాభాలు పొందే సూచనలు ఉన్నాయి. వ్యాపార రంగంలో ఉన్నవారు భారీ లాభాలను ఆర్జిస్తారు.

ఈ సమాచారం జ్యోతిష్య నిపుణులు మరియు ఇంటర్నెట్ లో లభించిన సమాచారం ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+