అక్షయ తృతీయ2023: ఈ రాశులవారికి అదృష్టం; 125 ఏళ్ళ తర్వాత వారికి పంచగ్రాహి యోగం!!

అక్షయ తృతీయ చాలా శుభప్రదమైన రోజు. అందరికీ ఐశ్వర్యాన్ని ఇచ్చే రోజు. ఇటువంటి అక్షయ తృతీయ ఈ సంవత్సరం ఏప్రిల్ 22వ తేదీన జరుపుకోవడానికి అందరూ రెడీ అవుతున్నారు. అయితే ఈసారి అక్షయ తృతీయ కొన్ని రాశుల వారికి ఊహించని అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. కొన్ని రాశుల వారి ఆర్థిక స్థితిగతులు మెరుగుపడి అన్ని విధాలుగా లాభం చేకూరుతుంది.

125 సంవత్సరాల తర్వాత పంచగ్రాహి యోగం:అక్షయ తృతీయ సందర్భంగా కొన్ని రాశుల వారికి పంచ గ్రాహి యోగం వారిని తిరుగులేనిదిగా చేస్తుంది. ఏప్రిల్ 22వ తేదీన అక్షయ తృతీయ రోజు మేషరాశిలో పంచగ్రాహీ యోగం ఏర్పడుతుంది. అక్షయ తృతీయ రోజు మేషరాశిలో సూర్యుడు, గురువు, బుధుడు, యురేనస్, రాహువు గ్రహాల అపూర్వ కలయిక జరుగుతుంది. 125 సంవత్సరాల తర్వాత వస్తున్న ఈ పంచగ్రాహీయోగంతో మేలు జరగనున్న రాశుల వివరాలు చూస్తే ..

Akshaya Tritiya 2023: Lucky for these zodiac

మేషరాశి :ముఖ్యంగా అక్షయ తృతీయ నాడు ఏర్పడే పంచగ్రాహి యోగంతో మేష రాశి వారికి లబ్ధి చేకూరుతుంది. పంచ గ్రాహీ యోగం వల్ల మేష రాశి జాతకుల అదృష్టం మామూలుగా ఉండదు. ఆర్థికంగా వీరికి అన్ని విధాలుగా లభించడమే కాకుండా, సమాజంలోని గౌరవం పెరుగుతుంది. ఉద్యోగంలో గణనీయమైన ప్రగతిని సాధించి, ప్రమోషన్లు పొందటానికి కూడా అవకాశం ఉంటుంది. అక్షయ తృతీయ రోజు దానధర్మాలు చేసిన వారికి కూడా మరింత మెరుగైన ప్రయోజనాలు ఉంటాయి.

వృషభ రాశి :అక్షయ తృతీయ నాడు ఏర్పడే పంచగ్రాహి యోగం వృషభ రాశి జాతకులకు మంచి ఫలితాలను ఇస్తుంది. జాతకంలో ఏర్పడిన ఈ రాజయోగం, వృషభ రాశి జాతకులకు కీర్తి ప్రతిష్టలను తెచ్చిపెడుతుంది. డబ్బు, పదవి కూడా వారికి లభిస్తుంది. వృషభ రాశి జాతకులు సంతోషంగా ఉండడానికి ఈ యోగం ఈ సమయంలో ఎంతగానో ఉపయోగపడుతుంది.

సింహరాశి : అక్షయ తృతీయ నాడు ఏర్పడే పంచగ్రాహి యోగం సింహ రాశి వారికి శుభ ఫలితాలను ఇస్తుంది. సింహరాశి జాతకులు చాలా కాలంగా నిలిచిపోయిన పనులు ఇప్పుడు పంచ గ్రాహి యోగం వల్ల పూర్తికానున్నాయి. అంతేకాదు ఆర్థికంగా పురోగతి ఉంటుంది. ఈ సమయంలో వీరికి ఐశ్వర్యం పెరుగుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. మీరు చేసే ప్రయత్నాలలో కుటుంబ పెద్దల సహకారం ఎంతగానో ఉంటుంది.

కర్కాటక రాశి : అక్షయ తృతీయ నాడు ఏర్పడే పంచగ్రాహి యోగం కర్కాటక రాశి జాతకులకు అన్ని విధాలుగా కలిసొస్తుంది. కర్కాటక రాశి జాతకులు ఏ పని చేసినా ఈ సమయంలో విజయం సాధిస్తారు. కర్కాటక రాశి జాతకులకు ధన లాభం కలుగుతుంది. ఆర్థికంగా పురోగతి కనిపిస్తుంది. మొత్తంగా చూస్తే అక్షయ తృతీయ కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలను, మరికొన్ని రాశుల వారికి అశుభ ఫలితాలను ఇస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+