50ఏళ్ళ తర్వాత జులై 13న అద్భుతయోగం.. ఈ రాశులవారు మట్టి పట్టుకున్నా బంగారం!
జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనం, గ్రహాల సంయోగం కారణంగా అనేక యోగాలు ఏర్పడతాయి. కొన్ని యోగాలు శుభ యోగాలు కాగా మరికొన్ని యోగాలు అశుభ యోగాలు. ప్రస్తుతం జూలై మాసంలో ముఖ్య గ్రహాల సంచారం అరుదైన యోగాలను ఏర్పరుస్తుంది. జూలై 13వ తేదీన శని తిరోగమన సమయంలో శని కారణంగా మహా విపరీత రాజయోగం ఏర్పడుతుంది.
విపరీత రాజయోగం
ఈ అరుదైన విపరీత రాజయోగం మొత్తం 12 రాశుల వారి జీవితాల పైన ప్రభావాన్ని చూపిస్తుంది. కొన్ని రాశుల వారికి మాత్రం ధన లాభం, వృత్తిపరమైన విజయాలను అందిస్తుంది. 50 ఏళ్ల తర్వాత అరుదైన విపరీత రాజయోగం తో లబ్ధిని పొందే ఆ రాశులు ఏమిటో తప్పక తెలుసుకుందాం.

మిధున రాశి
విపరీత రాజయోగం మిధున రాశి జాతకులకు అదృష్టాన్ని ఇస్తుంది. ఈ సమయంలో మిధున రాశి జాతకులు ఏ పని చేసినా కలిసి వస్తుంది. వర్తక వ్యాపారాలు చేసే వారికి లాభాలు రాగా, ఉద్యోగ జీవితంలో ఉన్నవారికి పురోగతి కనిపిస్తుంది. ఈ సమయంలో మిధున రాశి వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కోరిన కోరికలన్నీ తీర్చుకోగలుగుతారు.
కర్కాటక రాశి
విపరీత రాజయోగం కర్కాటక రాశి జాతకులకు శుభ ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో కర్కాటక రాశి జాతకులు సంతోషంగా జీవిస్తారు. వారి ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. ప్రేమ జీవితం మధురంగా మారుతుంది. వర్తక వ్యాపారాలు చేసే వారికి ఈ సమయం కలిసి వస్తుంది. ఉద్యోగులు ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు పొందే అవకాశం ఉంది.
మకర రాశి
విపరీత రాజయోగం కారణంగా మకర రాశి జాతకులు సానుకూల ఫలితాలను పొందుతున్నారు.మకర రాశి వారికి ఉద్యోగ, వ్యాపారాలలో కలిసివస్తుంది. కొత్త ఉద్యోగ అవకాశాలను పొందే అవకాశం ఉంటుంది. మకర రాశి వారికి ఈ సమయంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. ఆర్థికపరంగా అన్ని విజయాలు చేకూరుతాయి. ఇది వీరికి తిరుగులేని సమయం. ఈ సమయంలో ఎప్పటి నుండి వసూలు కాని మొండి బాకీలు వసూలు అవుతాయి.
Disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications