Akshaya Tritiya 2025: అక్షయ తృతీయ నాడు అద్భుతయోగాలు.. ఇలా చేస్తే లక్ష్మీదేవి కటాక్షం!
హిందువులు అత్యంత ఇష్టంగా జరుపుకునే పండుగలలో అక్షయ తృతీయ ఒకటి. ఈ అక్షయ తృతీయ పండుగను ప్రతి సంవత్సరం వైశాఖ మాసం శుక్లపక్ష తదియ నాడు జరుపుకుంటారు 30 తేదీన బుధవారం నాడు అక్షయ తృతీయ వచ్చింది. ఇక అక్షయ తృతీయ రోజు వివిధ ముఖ్య గ్రహాల సంచారం కారణంగా అనేక శుభ యోగాలు ఏర్పడుతున్నాయి.
అక్షయ తృతీయ రాజయోగాలు
అక్షయ తృతీయ ఏప్రిల్ 29వ తేదీ సాయంత్రం 5 గంటల 32 నిమిషాలకు ప్రారంభమై ఏప్రిల్ 30 తేదీ మధ్యాహ్నం 2 గంటల 12 నిమిషాలకు ముగుస్తుంది. సహజంగా ఉదయం ఉన్న తిధిని ప్రామాణికంగా తీసుకుంటాం కాబట్టి అక్షయ తృతీయను ఏప్రిల్ 31వ తేదీన జరుపుకుంటాం. ఇక అక్షయ తృతీయ పండుగ రోజు ఉదయం 6:15 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల 30నిమిషాల వరకు వివిధ రాజయోగాలు ఏర్పడుతున్నాయి.

ఏడు విశేషయోగాలు.. వీరిదే అదృష్టం
గజకేసరి రాజయోగం, చతుర్గ్రాహి యోగం, సర్వార్థ సిద్ధి యోగం, రవియోగం, శోభన యోగం, లక్ష్మీనారాయణ రాజయోగం, మాలవ్య రాజయోగం ఏర్పడుతున్నాయి. ఈ ఏడు యోగాల కారణంగా కొన్ని రాశుల వారు అదృష్ట జాతకులు అవుతున్నారు. అక్షయ తృతీయ నాడు ఏర్పడే యోగాల కారణంగా మకరరాశి వారు, తులారాశి వారు, సింహ రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది. వీరు ఏ పని చేసినా మంచి ఫలితాలు వస్తాయి, విజయలక్ష్మి వరిస్తుంది.
అక్షయ తృతీయ నాడు చెయ్యాల్సింది ఇదే
ఇక అక్షయ తృతీయ నాడు కొన్ని పనులు చేస్తే లక్ష్మీదేవి కటాక్షానికి ఎలాంటి డోకా ఉండదు. లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి అక్షయ తృతీయ పండుగ నాడు లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేయాలి. పండుగకు ముందే ఇల్లంతా శుభ్రం చేసుకుని, చెత్తాచెదారం లేకుండా చూసుకోవాలి. పాడైపోయిన వస్తువులు, పనికిరాని వస్తువులు, విరిగిపోయిన వస్తువులను ఇంటి నుండి తొలగించాలి.
ఇలా చేస్తే లక్ష్మీదేవి కటాక్షం
పూజ మందిరంలో ఉన్న విగ్రహాలలో విరిగిపోయిన పగిలిపోయిన విగ్రహాలను తీసివేయాలి. ఇంట్లో బూజు లేకుండా ఇల్లంతా శుద్ధి చేసుకుని లక్ష్మీదేవికి విశేషంగా పూజలు చేస్తే లక్ష్మీదేవి కటాక్షం తప్పనిసరిగా ఉంటుంది. ఇంటి ప్రధాన ద్వారం వద్ద కూడా శుభ్రం చేసి దీపం పెడితే లక్ష్మీ దేవి అనుగ్రహం లభిస్తుంది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications