అంగారక యోగం.. జూన్ 1వరకు ఈ రాశులవారికి ధననష్టం.. జాగ్రత్త
వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనం, గ్రహాల సంయోగం కారణంగా అనేక యోగాలు ఏర్పడతాయి. ఈ యోగాలు కొన్ని శుభయోగాలు కాగా మరికొన్ని అశుభయోగాలు. ప్రస్తుతం మీనరాశిలో కుజుడు ఉన్నాడు ఇక అప్పటికే అక్కడ రాహువు సంచరిస్తున్నాడు. మీనరాశిలో రాహువు, కుజుడు సంయోగం కారణంగా అంగారక యోగం ఏర్పడింది. ఈ అంగారక యోగం జూన్ 1వ తేదీ వరకు ఉంటుంది.
జూన్ 1 వరకు రాశులపై అంగారక యోగం ప్రభావం
కుజుడు మీనరాశిని వదిలి జూన్ 1వ తేదీన మేషరాశిలోకి ప్రవేశం చేసే సమయం వరకు దీని ప్రభావం ఉంటుంది. అంగారక యోగం సహజంగా ఒక అశుభయోగం. ఈ యోగం కారణంగా కొన్ని రాశుల వారు అనేక క్లిష్టమైన పరిస్థితిలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అంగారక యోగం వల్ల ఏ రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి అనే అంశాన్ని ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

కన్యా రాశి
అంగారక యోగంతో కన్యా రాశి వారికి అశుభ ఫలితాలు వస్తాయి. కన్యారాశి జాతకులు ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. ఎట్టి పరిస్థితులలోనూ ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు. పొరపాటున నమ్మితే ధననష్టం జరుగుతుంది. ఈ సమయంలో వ్యక్తిగత జీవితంలో విభేదాలు పెరిగే అవకాశం ఉంది. జీవితభాగస్వామి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. అన్నిటికంటే ఈ సమయంలో కోపం కంట్రోల్ చేసుకోవటం ఎంతో అవసరం.
ధనుస్సు రాశి
అంగారక యోగం కారణంగా ధనుస్సురాశి వారి జీవితాల పైన ప్రతికూలమైన ప్రభావాలు ఉంటాయి. ఈ సమయంలో వీరు కోపంతో మాట్లాడే మాటలపై అదుపు కోల్పోతారు. మనసు చంచలంగా ఉంటుంది. ఆరోగ్యంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో విభేదాలు రావచ్చు. ఆర్థిక విషయాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. ఈ సమయంలో కోపాన్ని అదుపులోకి పెట్టుకోకపోతే తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కోవాలి. ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించబడింది
మేషరాశి
అంగారక యోగం కారణంగా మేషరాశి జాతకుల జీవితాలలో ప్రతికూల పరిస్థితులు వస్తాయి. ఏదైనా పని మధ్యలోనే ఆపవలసి వస్తుంది. ఆర్థికంగానూ ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఈ సమయంలో మానసికంగా క్షోభను అనుభవిస్తారు. మితిమీరిన ఖర్చుల వల్ల ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతాయి. ఏ పని చేపట్టినా జాప్యం జరుగుతుంది. ఎంత కష్టపడినప్పటికీ తగిన ప్రతిఫలం రాదు. అంగారక యోగం సమయంలో మేషరాశి జాతకులు జాగ్రత్తగా ఉండాలి.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య శాస్త్ర పండితుల అభిప్రాయాలు, సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications