ఏప్రిల్ 13 ధనజ్యోతిష్యం: ఈ రాశులవారికి ఆర్ధికంగా సూపర్ గా ఉంది!!
వేద జ్యోతిష్య శాస్త్రంలో ప్రతి రోజుకి ఒక ప్రాముఖ్యత ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనం కారణంగా అన్ని రాశుల వారి జీవితాలలో గణనీయమైన మార్పులు వస్తాయి. ఇక నేడు ఏప్రిల్ 13వ తేదీన ద్వాదశ రాశుల వారికి గ్రహాల గమనం కారణంగా ధన జ్యోతిష్య ఏ విధంగా ఉంటుంది? వారి ఆర్థిక పరిస్థితులు ఎలా ఉంటాయి? తెలుసుకుందాం.
మేష, వృషభ రాశుల ధన జ్యోతిష్యం ఇలా
మేష రాశి వారు ఈ రోజు డబ్బు విషయాల పట్ల వాస్తవిక దృక్పథంతో ఉంటారు. ఇది మీరు కోరుకున్న ఆర్థిక లక్ష్యాలను ఇంతకుముందు కంటే తక్కువ వ్యవధిలో సాధించడానికి సహాయపడుతుంది. వృషభ రాశి వారు ఆర్థికంగా ప్రమాదకర నిర్ణయాలను ఈరోజు తీసుకోకుండా ఉంటారు. ఫిక్స్డ్ డిపాజిట్ స్కీము లలో లేదా రెగ్యులర్ గా రిటర్న్స్ ఇచ్చే వాటిలో పెట్టుబడులు పెట్టాలని నిర్ణయాలు తీసుకుంటే మంచిది.

మిధున, కర్కాటక రాశుల ధన జ్యోతిష్యం
మిధున రాశి వారు ఈరోజు డబ్బు ముఖ్యంగా ఆరోగ్యం విషయంలో ఖర్చు పెడతారు. ఈరోజు హెల్త్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. బయట ఆహారాన్ని తినకుండా ఉంటేనే మంచిది. అది మీ ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. కర్కాటక రాశి వారికి ఆర్థిక విషయాలలో ఈరోజు ఒక సామాన్యమైన రోజుగా చెప్పబడింది. మీరు గట్టి ప్రయత్నాలు చేస్తే తప్ప ఈరోజు ఆర్థిక లాభాలు అంతగా కనిపించవు.
సింహ, కన్యారాశుల వారు జాగ్రత్త
సింహరాశి వారు ఈరోజు ఎవరికి అప్పులు ఇవ్వకుండా ఉంటే మంచిది. ఎందుకంటే ఈరోజు అప్పులు ఇస్తే మళ్లీ దాన్ని తిరిగి పొందడం చాలా కష్టమవుతుంది. ఈరోజు మీరు మీ సొంతంగా ఏదైనా కొత్త ప్రారంభించవచ్చు. అది తర్వాత కాలంలో మీకు ఆర్థిక లాభాలను తెచ్చిపెడుతుంది. కన్యా రాశి వారికి ఆర్థిక వ్యవహారాలు ఈరోజు తీవ్ర ఆందోళన కలిగిస్తాయి. మీ ఆర్థిక పరిస్థితి చాలా బాగున్నప్పటికీ ఈరోజు కొంత ఆందోళన కనిపిస్తుంది.
తులా, వృశ్చిక, ధనుస్సు రాశుల ధన జాతకమిలా
తులా రాశి వారికి ఈరోజు ఊహించని ఖర్చులు. రోజు మొదటి అర్థభాగంలో కనిపిస్తున్నాయి. వైద్య ఖర్చులు కూడా ఈరోజు ఎక్కువగా అయ్యే అవకాశం ఉంది. వృశ్చిక రాశి వారికి ఈరోజు ద్వితీయార్థంలో ఖర్చులను తగ్గించుకునే అవకాశం ఉంది. ధనస్సు రాశి వారికి ఈ రోజు ప్రథమార్ధంలో పెద్దగా ఖర్చులు కనిపించడం లేదు. ఈరోజు సాయంత్రం సంతోషంగా కుటుంబ సభ్యులతో గడిపేందుకు ప్లాన్ చేసుకోవచ్చు.
మకర, కుంభ, మీన రాశులవారికి ఆర్ధికంగా ఇలా ఉంటుంది
మకర రాశి వారికి ఆర్దిక కార్యకలాపాలకు ఈరోజు అనుకూలమైన రోజుగా కనిపిస్తుంది. అయితే ఆరోగ్యం విషయంలో జాగ్రత్త. కుంభ రాశి వారికి ఈరోజు కొత్త వస్తువులను కానీ వాహనాలను కానీ కొనుగోలు చేయడానికి శుభప్రదమైన రోజు. ఈరోజు వీరికి ఆర్ధికంగా సూపర్ గా ఉంటుంది. మీన రాశి వారికి ఈరోజు మీరు డబ్బు ఖర్చు చేసినప్పటికీ ఆర్థికంగా ఇబ్బందికర పరిస్థితులు ఏమీ ఉండవు.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.
-
వాస్తు ప్రకారం దేవుడి గది ప్రత్యేకంగా ఉండాలా? మరణించినవారి ఫొటోలు ఉండొచ్చా? -
ఏప్రిల్ లో చతుర్గ్రాహి యోగంతో వీరు ఏనుగు కుంభస్థలం బద్దలుకొట్టి సంపన్నులవుతారు -
today rashiphalalu:నేడు ముఖ్య గ్రహాల సంచారంతో వీరింటికి ధనలక్ష్మి! -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
IPL తొలి మ్యాచ్ లోనే సెన్సేషన్, ఎవరీ కూపర్ కనోలీ - సూర్యవంశీని డామినేట్ చేస్తూ..!! -
పాల ధరలు భారీగా పెంపు, ఒకే సారి - కొత్త రేట్లు ఇలా..!! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!!












Click it and Unblock the Notifications