ఏప్రిల్ నెలలో ఈ రాశుల సుడి తిరిగింది
గ్రహాలు నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరో రాశికి సంచారం చేస్తుంటాయి. ఇలా సంచారం చేసే క్రమంలో కొన్ని రాశులకు మంచి ఫలితాలు, మరికొన్ని రాశులకు ప్రతికూల ఫలితాలు ఎదురవుతుంటాయి. ఏప్రిల్ నెలలో కూడా కీలకమైన గ్రహాల రాశి సంచారం ఉంది. ఈ క్రమంలో ఏయే రాశులకు ఏప్రిల్ నెల ఎలా కలిసిరానుంది? ఎటువంటి ఫలితాలు ఎదురవుతున్నాయి?.. తదితర విషయాలను తెలుసుకుందాం.
మేష రాశి
కొత్త విజయాలు సాధిస్తారు. కుటుంబ పెద్దల ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఆదాయంలో పెరుగుదల ఉంది. ఉద్యోగంలో మార్పు ఉంటుంది.

వృషభ రాశి
ఆర్థికంగా మెరుగవుతారు. వ్యాపారస్తులకు మంచి అవకాశాలున్నాయి. ఆరోగ్యంపై జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యులతో కలిసి ఆధ్యాత్మిక యాత్రలకు వెళతారు. ఓర్పుగా ఉంటారు. ఆత్మవిశ్వాసం ఎక్కువ.
మిథున రాశి
ఏ పని తలపెట్టాలన్నా కుటుంబం నుంచి మద్దతు లభిస్తుంది. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. కొత్త బాధ్యతలు ఉద్యోగంలో వస్తాయి. ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలున్నాయి. మనసు బాధగా ఉంటుంది. ఆత్మనిగ్రహంగా ఉండాలి.
కర్కాటక రాశి
మీకు ఇష్టమైనవారిని కలుస్తారు. డబ్బుకు సంబంధించిన విషయాల్లో జాగ్రత్త అవసరం. మనసులో ఆనందం, ఆందోళన రెండూ ఉంటాయి. వీటిల్లో హెచ్చుతగ్గులు కూడా ఉంటాయి. కొత్త వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. దీనికోసం కొత్త ప్రదేశానికి వెళతారు.
సింహ రాశి
విద్యార్థులు విజయం సాధిస్తారు. ఆత్మవిశ్వాసంతో ఉంటారు. ఆస్తి గొడవలన్నీ తగ్గిపోతాయి. ఉద్యోగులకు వేతనం పెరుగుతుంది. కుటుంబంలో శుభకార్యాలున్నాయి.
కన్యా రాశి
కోర్టు కేసుల్లో ఇబ్బందులున్నాయి. విదేశాలకు వెళతారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ప్రేమ జీవితంలోకి ప్రత్యేకమైన వ్యక్తి వస్తాడు. నెలంతా బాగుంటుంది.
తులా రాశి
కోపం తగ్గించుకోవాలి. మనసులో ఆందోళన ఉంటుంది. డబ్బు విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. కెరీర్ లో పెద్ద విజయాన్ని లభించి సమాజంలో గౌరవాన్ని అందుకుంటారు.
వృశ్చిక రాశి
మాటల్లో నిగ్రహం ఉండాలి. వివాహం కుదురుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. వ్యాపారంలో లాభాలను ఆర్జిస్తారు. ఆస్తి వివాదాలు పరిష్కరించకపోతే పెద్దవి అవుతాయి.
ధనుస్సు రాశి
పెట్టుబడులు పెట్టేటప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఏ పని తలపెట్టినా విజయం తథ్యం. విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. ఆదాయం పెరుగుతుంది.
మకర రాశి
కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. కొత్త విషయాలను కనుగొని పేరు తెచ్చుకుంటారు. కష్టానికి తగిన ప్రతిఫలాన్ని పొందుతారు.
కుంభ రాశి
కొత్తగా ఇంటిని లేదంటే వాహనాన్ని కొనుగోలు చేస్తారు. వృత్తి జీవితంలో విజయం ఉంది. కొత్తగా వచ్చే మార్పులను అంగీకరించేందుకు సిద్ధంగా ఉండాలి. స్నేహితులతో కలిసి వ్యాపారం కోసం విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది.
మీన రాశి
దూర ప్రయాణాలు చేస్తారు. కుటుంబ వాతావరణం సానుకూలంగా ఉంటుంది. కెరీర్ పరంగా మంచి వృద్ధిలోకి వస్తారు.












Click it and Unblock the Notifications