కుంభరాశి వారికి అన్నీ అనుకూలించిన అది మాత్రం దక్కదు..? ఏంటది..?

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151

ఆదాయం 8, వ్యయం - 11 రాజపూజ్యం - 6, అవమానం - 3

• కుంభరాశి వారికి గోచార ఏలిననాటి శని ప్రధమ భాగం నడుస్తున్నంది.

• పంచమంలో ఉన్న రాహువు, ఏకాదశంలో ఉన్న గురుకేతువులు వ్యయంలో ఉన్న శని ప్రభావ కారణంగా ఫలితాలు.

• శుక్ర, బుధ మహర్దశ నడుస్తున్న వారికి అనుకూలంగా ఉంటుంది.

• కేతు, శని మహర్దశ నడుస్తున్న వారాలకు కొంత ఎక్కువ శాతం చెడు ఫలితాలను చవిచూడాల్సి వస్తుది.

• మొత్తానికి ఈ సంవత్సరం నవంబర్ వరకు మధ్యస్త అనుకూలంగా ఫలితాలు ఉంటాయి.

• అన్ని అనుకూలంగా ఉన్ననూ మానసికంగా మాత్రం తృప్తిని పొందలేరు.

• ప్రభుత్వ కార్యాలయంలో మీ పరపతి పెరుగుతుంది. అయినా సాధారణ ఫలితాలు మాత్రమే సాధిస్తారు.

• నమ్ముకున్న వ్యక్తులు, మీవారు అనుకున్న వ్యక్తులు, రాజకీయ నాయకులు, అధికారులు చెప్పుకోదగిన స్థాయిలో ఉపయోగపడరు.

• మధ్యవర్తులు ఇతరుల పేర్లు చెప్పి డబ్బు గుంజుతారు. అందులో అబద్దాలు ఉన్నాయని తెలిసినా డబ్బు సర్దుబాటు చేస్తారు.

• అందరినీ వ్యతిరేకించి మీరు పట్టుబట్టి ఉన్నతస్థానంలో ఉంచిన వ్యక్తులు మీకు మేలు చేయరు. ఆత్మీయవర్గం కూడా కొన్ని సందర్భాలలో అపార్ధం చేసుకోవడం జరుగుతుంది.

• మొండి బాకీల వ్యవహారాలు కొత్త మలుపు తిరుగుతాయి. మీ సాటివాళ్ళు అధికంగా లాభం పొందుతారు.

• అనుభవం లేని రంగాలలో కొత్తవారిని నమ్మి వ్యాపారంలో దిగుతారు. భాగస్వాములుగా చేరమని ఒత్తిడి తెస్తారు.

• అత్యున్నత విజ్ఞానవాదులు, ఎంతో పుణ్యం కలిగినవారు, సమాజంలో ప్రముఖులు వారి భావాలకు విరుద్ధంగా మీతో స్నేహం చేస్తారు.

• మీ మాటలు, సలహాలు, ప్రవర్తన అందరికి విశేషంగా ఆకట్టుకుంటాయి.

• కొందరు మిమ్మల్ని నియమ నిబంధనలకు బాధించినా కొంతకాలం తర్వాత ప్రయోజనాలు చేకూరుతాయి.

Aquarius 2020 Horoscope - Major Life Changes to expect!

• అవివాహితులకు వివాహ సమయం. అనుకూలమైన సంబంధం లభిస్తుంది.

• మాట్లాడేప్పుడు జాగ్రత్తగా ఆచి తూచి వ్యవహరిచండి, మీ మాటలకు వక్రార్ధాలు వచ్చే అవకాశం ఉంది.

• కోర్టు వ్యవహారాలు అనుకూలిస్తాయి.

• ప్రభుత్వ పధకాల వలన లాభం చేకూరుతుంది.

• విదేశీయాన ప్రయత్నాలు ఊహించిన సమయం కంటే ముందే అనుకూలిస్తాయి.

• రక్షా యంత్రం మీ పాకెట్లో ధరించడం వలన నరదృష్టి తొలగిపోయి, జనాకర్షణ ఏర్పడుతుంది.

• మీరు ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బు మీద మీకు అధికారం లేకుండా పోతుంది.

• మీకు ఇష్టం లేకపోయినను రాజకీయ రంగ ప్రవేశ ఆస్కారం కలుగుతుంది.

• ప్రేమ వివాహాలు ప్రధాన చర్చాంశాలు అవుతాయి. ఆత్మీయులతో వాగ్వివాదం సంభవిస్తుంది.

• సంసార జీవితంలో భేదాభిప్రాయాలు ఉన్నా అవి పెద్దగా ప్రభావం చూపవు.

• కొందరు మీకు ఇష్టం లేని చేయడమే ప్రధాన పనిగా పెట్టుకుంటారు.

• చిన్న చిన్న వ్యాపారాలు చేస్తున్నవారికి అనుకూలంగా ఉంది.

• మొత్తానికి ఈ సంవత్సరం మానసిక టెన్షన్ తప్ప అంతా సవ్యంగా సాగుతుంది.

మీ పుట్టినతేదీ ఆధారంగా వ్యక్తిగత జాతక చక్రాన్ని వేయించుకుని పూర్తి వివరాలు తెలుసుకోండి. ఏమైనా ఇబ్బందులు ఉంటే పరిహారాలు పాటించండి తప్పక శుభాలు కలుగుతాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+