2025లో ఈ రాశులవారితో ఆర్తనాదాలు పెట్టిస్తానంటున్న అర్దాష్టమ శని!

వేద జ్యోతిషశాస్త్రంలో శని గ్రహానికి చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది. శని మన జాతకాన్ని ఎలా అయినా మార్చవచ్చు. శని తలుచుకుంటే అమీర్ ను గరీబ్ ను చేయగలడు. ఇక జ్యోతిష్య శాస్త్రంలో శని కారణంగా ఏలినాటి శని, అష్టమ శని, అర్తాష్టమ శని మరియు కంటక శని అనేవి శని యొక్క ప్రభావాలను ఒక వ్యక్తి జీవితంపై వివరించడానికి ఉపయోగించే పదాలు.

అర్టాష్టమ శనితో కష్టాలు
ప్రతి పదం వ్యక్తి యొక్క జాతకం లేదా జన్మ చార్ట్‌లో శని యొక్క నిర్దిష్ట స్థానాన్ని సూచిస్తుంది. వ్యక్తి యొక్క నిర్దిష్ట చార్ట్‌ లో శని ఉన్న స్థానంపై ఆధారపడి ప్రభావాలు మారవచ్చు. వ్యక్తి యొక్క చంద్ర రాశి నుండి 6 వ ఇంట్లో శని ఉంచినప్పుడు అర్టాష్టమ శని సంభవిస్తుంది. 6వ ఇల్లు ఆరోగ్యం, శత్రువులు మరియు అడ్డంకులతో ముడిపడి ఉన్నందున ఇది సవాలుగా పరిగణించబడుతుంది.

Ardashtama Shani will not leave these zodiac signs for two and a half years problems and financial losses

అర్దాష్టమ శనితో ఇబ్బందులు
ఈ కాలంలో వ్యక్తి ఆరోగ్య సమస్యలతో బాధ పడతాడు.శత్రువులతో వివాదాలు, చట్టపరమైన సమస్యలతో పాటు వారి లక్ష్యాలను సాధించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. అయితే, ఈ ప్లేస్‌మెంట్ వ్యక్తికి సవాళ్లను అధిగమించడానికి శక్తిని మరియు దృఢనిశ్చయాన్ని కూడా అందిస్తుంది. ఇదిలా ఉంటె 2025లో మీనరాశిలో శని సంచారం జరుగుతుంది. ఈ సమయంలో కొన్ని రాశులవారు ఏలినాటి శనిని, మరికొన్ని రాశులవారు అర్దాష్టమ శనిని ఎదుర్కొంటారు.

ఈ రాశుల వారికి అర్దాష్టమ శని ప్రభావం
మీనరాశిలో శని సంచారం కారణంగా మేషరాశి, మీనరాశి జాతకులు ఏలినాటి శనిని ఎదుర్కోబోతున్నారు. ఈ సమయంలో వీరు అనేక ఇబ్బందులు, ఆర్ధిక నష్టాలు, కష్టాలు ఎదుర్కొంటారు. ఇక మీనరాశిలో శని సంచారం కారణంగా ధనుస్సు, మరియు సింహ రాశుల వారు అర్దాష్టమ శనిని ఎదుర్కొంటారు. ఇది రెండున్నర సంవత్సరాలు వీరిని ఇబ్బంది పెడుతుంది, ఈ సమయంలో వీరు అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.

అర్దాష్టమ శని ప్రభావంతో ధన నష్టం.. 2027 వరకు జాగ్రత్త
అర్దాష్టమ శని ప్రభావంతో ధన నష్టం జరిగే అవకాశం కూడా ఉంది. 2027 వరకు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశాలు ఉన్నాయి. జీవితంలో ఏదైనా కీలకమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ధనుస్సు మరియు సింహ రాశుల వారు ఆచితూచి వ్యవహరించాలి. అన్ని విషయాలలోనూ ఈ రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+