ఆషాడ అమావాస్య నేడు.. విశేషయోగాలతో వీరికి ప్రారంభమైంది ధనయోగం!
వేద జ్యోతిషశాస్త్రంలో జూలై 24వ తేదీ అంటే నేడు ఒక విశిష్టమైన ప్రాధాన్యత ఉంది. ఈరోజు ఆషాడ అమావాస్య దీనినే చుక్కల అమావాస్య అని కూడా అంటారు. ఈరోజు కర్కాటక రాశిలో చంద్రుడు సంచరిస్తున్నాడు. కర్కాటకంలో బుధుడు సూర్యుడు, చంద్రుడు కలిసి త్రిగ్రాహి యోగాన్ని ఏర్పరుస్తూ ఉన్నారు.
నేడు విశేష యోగాలు
దీనికి తోడు ఈరోజు పుష్య నక్షత్రంలో గురుడు సంచరిస్తున్నాడు. ఫలితంగా గురు పుష్య యోగం కూడా ఏర్పడుతుంది. త్రి గ్రాహి యోగం, గురు పుష్య యోగం తోపాటు సర్వార్థ సిద్ధి యోగం, అమృత సిద్ధి యోగం కూడా చుక్కల అమావాస్యనాడు ఏర్పడడం కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని ఇస్తుంది. ఈ శుభ యోగాల కారణంగా అదృష్టవంతులు అయ్యే ఆ రాశుల వారు ఎవరో తెలుసుకుందాం.

మేషరాశి
మేష రాశి వారికి ఆషాడ అమావాస్య అదృష్టాన్ని ఇస్తుంది. ఈరోజు ఏర్పడే శుభ యోగాలు వీరికి ప్రయోజనాలను చేకూరుస్తాయి. ఉద్యోగాలు చేసేవారు కెరీర్ పరంగా మంచి విజయాలను సాధిస్తారు. ఆర్థికంగా లబ్ధిని పొందుతారు. మీరు ఈ సమయంలో చేపట్టిన పనులన్నీ విజయవంతమవుతాయి. నేటి నుండి ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి. కొన్ని శుభవార్తలు వినే అవకాశం ఉంది.
మిధున రాశి
ఆషాడ అమావాస్య వేళ మిధున రాశి వారికి శుభ ఫలితాలు కలుగుతాయి. మిధున రాశి వారు ఈ సమయంలో ఏ పని చేసిన విజయం సాధిస్తారు. ఉద్యోగాలు లేని వారికి నూతన ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగాలు చేస్తే వారికి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు వస్తాయి. వర్తక, వ్యాపారాలు చేసే వారికి లాభాలు వస్తాయి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధించే అవకాశం ఉంది.
సింహరాశి
సింహరాశి జాతకులకు ఆషాడ అమావాస్య అదృష్టాన్ని ఇస్తుంది. ఈ రాశివారు నేటి నుంచి చేసే ప్రతి ప్రయత్నం విజయాలకు కారణమవుతుంది. వర్తక వ్యాపారాలు చేసే వారికి ఆర్థిక లాభాలు కలుగుతాయి. సింహ రాశి వారి ప్రేమ జీవితం సంతోషంగా ఉంటుంది. ఆర్థికంగా మెరుగైన ఫలితాలను పొందుతారు. అప్పుల బాధ నుంచి విముక్తి లభిస్తుంది.
మకర రాశి
ఆషాడ అమావాస్య మకర రాశి వారికి శుభ ఫలితాలకు కారణమవుతుంది. ఆషాడ అమావాస్య రోజు ఏర్పడే యోగాల కారణంగా మకర రాశి జాతకుల ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఈ సమయంలో ఆదాయం పెరుగుతుంది .ఉద్యోగులకు ప్రమోషన్లు వస్తాయి. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. విదేశాలలో పనిచేయాలనుకునే వారి కల నెరవేరుతుంది.
Disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications