వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హిందువులు డబ్బు ఎలా ఖర్చు పెట్టాలంటే..?

ఇతర మతాల్లోలాగ, హిందూమతంలోకూడ మనం సంపాదించినది ఎలాఖరుపెట్టాలో చెప్పబడిందా? అనే విషయంతోపాటు పుట్టుమచ్చల ఫలితాల గురించి జ్యోతిష్కుడు వివరించారిలా..

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఇతర మతాల్లోలాగ, హిందూమతంలోకూడ మనం సంపాదించినది ఎలాఖరుపెట్టాలో చెప్పబడిందా? అనే విషయంతోపాటు పుట్టుమచ్చల ఫలితాల గురించి జ్యోతిష్కుడు వివరించారిలా..

1. ఇతర మతాల్లోలాగ, హిందూమతంలోకూడా మనం సంపాదించినది ఎలాఖరుపెట్టాలో చెప్పబడిందా?

క్రైస్తవులు, ఇస్లామిక్ మతస్తులు సంపాదనలో ఎంత ఎలా ఖర్చు చేయాలి అని ఉన్నట్లు హిందు మతంలో, ఎక్కడైనా ఉందా? అని కొదరికి సందేహం రావచ్చు, మరికొందరికి తెలియదు.

 astrologer tells about how to spend money and moles effects

అవును. మన గ్రంథాలూ చెప్పాయి.
ధర్మాయ యశసే అర్ధాయ
కామాయ స్వజనాయచ
పంచధా విభజన్ విత్తం
ఇహా ముత్రచ మోదతే అని భాగవతం ఎనిమిదవ స్కంధంలో చెప్పబడింది. ప్రతి వ్యక్తి తాను సంపాదించినదానిని ఐదుగా విభజించాలి. ఒక భాగం, ధార్మిక కార్యక్రమాలకు తప్పనిసరిగా వినియోగించాలి.

గుప్తదానాలు, ధర్మాలు, యజ్ఞాలు, యాగాలు, ఈతి బాధల్లో మునిగిన ఆర్తులకు సహాయం మున్నగు కార్యక్రమాలు, ప్రచారం కోసం కాకుండా చిత్తశుద్ధితో చెయ్యాలి. అన్నీ భగవత్పరంగా చెయ్యాలి. ఇవే మనిషిని కృతకృత్యుణ్ణి, చేస్తాయి. రెండవ భాగాన్ని మీకు కీర్తి ప్రతిష్టలు తెచ్చే ప్రజోపయోగశాశ్వతకార్యక్రమాలపై వెచ్చించాలి. ఆలయాలు, ధర్మశాలలు, అనాథ సేవాశ్రమాలు, పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు విద్యా, వైద్య కార్యక్రమాలు, నిత్యాన్నదాన పథకాలు, పండిత సమ్మానాలు, పన్నుల చెల్లింపు మున్నగునవి ఒక వ్యక్తి కీర్తి ప్రతిష్టలను చిరకాలం నిలబెడతాయి.

మూడవ భాగం, తిరిగి తాను ధనం సంపాదించడానికి పెట్టుబడిగా పెట్టాలి. ఉద్యోగులైతే పొదుపు పథకాల్లోను, ఇళ్ళ స్థలాలు, షేర్లు వీటిపై మదుపు పెట్టాలి. నాల్గవ భాగం తన స్వంత సుఖాలు, అవసరాల కోసం ఖర్చుపెట్టాలి. ఇక మిగిలిన అయిదో భాగం తనను ఆశ్రయించి ఉన్నవారి సుఖాలు, అవసరాలు, అభివృద్ధి కోసం ఖర్చుపెట్టాలి. వాళ్ళు కూడా ధర్మయుతంగా సంపాదించుకుంటూ, ఖర్చుపెడుతూ మీలాగే పిల్లాపాపలతో సుఖంగా ఉండేట్టు తోడ్పడాలి. మన ధర్మశాస్రాలు మనకు ఎంత చక్కని ప్రణాళిక ఇచ్చాయో చూడండి.

2. అసలు పుట్టుమచ్చలు ఎన్ని రకాలు ఎలాంటి ఫలితాల్ని ఇస్తాయి ?

రంగు, నలుపు రంగుల్లో వుంటాయి. ఈ రంగులను బట్టి ఫలితాలు కూడా వుంటాయి,
పసుపురంగు సాధారణ ఫలితము ఎరుపు మంచి పలితము మిక్కిలి శుభఫలితము ఆకుపచ్ల గంధం సాధారణ ఫలితము నలుపు - చెడు ఫలితము ఆకారము బట్టిపట్టుమచ్చలు వివిధ ఆకారములు కలిగి వుంటాయి.

1. చుక్కలా వుండేవి 2. సన్నగా పొడవుగా 3. వంకరగా వుండేవి 4 చదరంగా వుండేవి 5. ముక్కోణపు ఆకృతి కలిగినవి. 6. పుటుమచ్లలపై వెంట్రుకలు కలవి.7. పెద్దవిగా వుండేవి.

సన్నగా పొడవుగా వుండేవి మంచి ఫలితము నివ్వగలవు. పెద్దవిగా వంకరగా వుండేవి చెడుఫలితము నివ్వగలవు. చదరంగావుండేవి మొదట మంచి ఫలితము కలగకపోయినా ఆఖరులో మంచిఫలితము నందివ్వగలవు. ముక్కోణపు పుట్టుమచ్చలు మిశ్రమ ఫలితముల నందివ్వగలవు. పుట్టుమచ్చలపై పలచగా వెంట్రుకలుండిన సంపద, కీలకలుగును. దట్టంగావుంటేదరిద్రము,విచారముకలిగే అవకాశముంది.

గుర్తుంచుకోవలసిన విష్యములు కొన్ని మంచి ఫలితములు, మరికొన్ని చెడు ఫలితముల నివ్వగలవు పుట్టుమచ్లల ఫలితములు చెడు ఫలితములు రంగునుబట్టి నిర్ణయించుకోవాలి. కేవలం పుట్టుమచ్లని బట్టి నిర్ణయించరాదు.

మద్దల శుభ, అశుభ ఫలితములు కొంతమేర వుంటాయి గానీ స్థాన బలము గొప్పది.
చెడ్డ మచ్చలు (నలుపురంగు మచ) మంచి స్థానములో చేకూరవలసిన శుభ ఫలితము 1/3 వంతు మాత్రమేనని గ్రహించాలి.

English summary
Astrologer described about how to spend money and moles effects.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X