2025లో ఈ రాశులవారికి కొంచెం నష్టం.. కొంచెం లాభం; వేణుస్వామి జ్యోతిష్య అంచనా!
2025 సంవత్సరం వస్తుందంటేనే కొత్త సంవత్సరం జీవితం, జాతకం అంతా బాగా ఉండాలని కోరుకుంటారు. 2025 సంవత్సరంలో మా రాశి జాతకం ఎలా ఉందో తెలుసుకోవాలని ఆశ పడతారు. అయితే 2025లో ఎవరి జాతకం ఎలా ఉంది అనేది ప్రముఖ జ్యోతిష్యులు వేణుస్వామి వెల్లడించారు. 2025లో ఏ రాశివారు ఇబ్బందులతో పాటు, ప్రయోజనాలను కూడా పొందబోతున్నారు. ఎవరికి మిశ్రమ ఫలితాలు వస్తున్నాయనేది వేణుస్వామి జ్యోతిష్య అంచనాల ప్రకారం ప్రస్తుతం తెలుసుకుందాం.
కర్కాటక రాశి
2025లో కర్కాటకరాశి వారికి అష్టమశని వెళ్ళిపోతుందని, 9వ స్థానంలో శని ప్రవేశించనున్నాడని, గురువు వ్యయంలోకి రాబోతున్నాడని దీని కారణంగా ఈ రాశివారికి మిశ్రమ ఫలితాలు ఉన్నాయన్నారు. కర్కాటకరాశి వారికి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని, ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇక కోర్టు వ్యవహారాలలో, చదువు విషయంలో కలిసి వస్తుందని పేర్కొన్నారు. విదేశాలలో పెట్టుబడులు పెట్టేవారికి కలిసొస్తుంది. రైతులకు ఇది శుభ సమయం.

సింహరాశి
సింహరాశి వారికి ఈ సంవత్సర అష్టమ శని ప్రారంభం అవుతుందని రాహువు ఏడవ స్థానంలోనూ, కేతువు జన్మస్థానంలోనూ ఉండడం వల్ల కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉందని వేణు స్వామి చెప్పారు. సింహరాశి జాతకులు తల్లి ఆరోగ్యం ఇబ్బందికరంగా ఉంటుందని, బంధువులు, స్నేహితులతో విరోధాలు ఏర్పడతాయని పేర్కొన్నారు. అయితే ఆదాయం బాగా పెరుగుతుందని. ఈ సమయంలో వివిధ మార్గాలలో ఆదాయం వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వోద్యోగాలు చేసేవారికి అనుకూలం.
తులారాశి
2025 సంవత్సరంలో తులారాశి వారికి మిశ్రమఫలితాలు ఉంటాయని పేర్కొన్నారు. ఆదాయం గణనీయంగా పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. తులారాశి వారు ఏ రంగంలోనైనా 2025లో అద్భుతంగా రాణిస్తారని వేణుస్వామి చెప్పారు. ఈ రాశికి చెందిన వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు, రైతులకు అన్ని విధాలుగా అనుకూలం. అయితే అనేక వివాదాలలో చిక్కుకునే ప్రమాదం కూడా ఉందని హెచ్చరిస్తున్నారు. తులారాశి జాతకులకు సమాజంలో చెడ్డపేరు వచ్చే అవకాశం ఉందన్నారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.
వృశ్చిక రాశి
2025 లో వృశ్చికరాశి వారికి అర్ధాష్టమ శని వెళ్ళిపోయే అవకాశం ఉంది. దీని కారణంగా వృశ్చికరాశి వారికి కొన్ని సానుకూలతలు ఉన్నప్పటికీ మరికొన్ని ప్రతికూలతలు కూడా ఉన్నాయి. వృశ్చిక రాశి వ్యక్తులు 2025 లో చెడ్డపేరు పొందే అవకాశం ఉంది. మీరు ఏ రంగంలో ఉంటే ఆ రంగంలో శత్రువులు తయారయ్యే అవకాశం ఉంది. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు బాధిస్తాయని, బంధువుల నుంచి వ్యతిరేకత ఎదురవుతుందని వేణు స్వామి చెప్పారు. వృత్తి, ఉద్యోగ, వాపారాల్లో వీరు రాణిస్తారు. మంచి లాభాలను పొందడంతో పాటు ఉద్యోగంలో భారీగా జీతం పెరిగే అవకాశం ఉంది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications