Astrology: శుక్రసంచారంతో ఈ రాశులవారికి అరుదైన లక్ష్మీయోగం; మీరు ఆ జాబితాలో ఉన్నారా చూసుకోండి!!

వేద జ్యోతిష్య శాస్త్రంలో శుక్ర గ్రహం కర్కాటక రాశిలోకి సంచరించినప్పుడు, మకర రాశిలో చాలా అరుదుగా లక్ష్మీ యోగం ఏర్పడుతుంది. ఇది సంపద, సమృద్ధి మరియు శ్రేయస్సు యొక్క సంకేతంగా చెప్పబడుతుంది. సంపదకు దేవత అయిన లక్ష్మీదేవి చల్లని చూపు ఈ సమయంలో కొన్ని రాశులపై ప్రత్యేకంగా పడుతుంది.

ఎవరైతే ఈ లక్ష్మీ యోగంలో పుడతారో వారు సంపదను ఆకర్షించే వ్యక్తులుగా, ఆర్థిక స్థిరత్వం కలిగిన వ్యక్తులుగా ఉంటారు. వారు చాలా మనోహరమైన అయస్కాంత వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. అంతేకాదు ఆధ్యాత్మిక విలువలతో జీవిస్తారు. లక్ష్మీయోగం వల్ల దీర్ఘకాల శ్రేయస్సు కలుగుతుంది.లక్ష్మీ యోగం వల్ల వారు సంతృప్తిగా జీవించడానికి ఆస్కారం ఉంటుంది.

Astrology

ఈ సంవత్సరం లక్ష్మి యోగం మే 30 వ తేదీన 07:39 కు శుక్రుడు కర్కాటక రాశిలో ప్రవేశించినప్పుడు ఏర్పడింది. అయితే ఈ యోగం మకర రాశిలో ఏర్పడటం వల్ల నాలుగు రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. ఇదిలా ఉంటే శుక్రుడు కర్కాటక రాశి నుండి జూలై 7వ తేదీ నాడు సింహరాశిలోకి మారతాడు.

అత్యంత పవిత్రమైన లక్ష్మి యోగం వల్ల మేష రాశి, కర్కాటక రాశి, కన్య రాశి, మకర రాశి జాతకులకు సానుకూల ఫలితాలు వస్తాయి. లక్ష్మీ యోగం వల్ల మేష రాశి జాతకులకు అదృష్టం కలిసొస్తుంది. వారు వస్తువులను గాని, వాహనాలను గాని, ఇళ్ల స్థలాలను గాని కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. కెరీర్లో పురోగతి ఉంటుంది. కుటుంబజీవితం కూడా అభివృద్ధి చెందుతుంది. వారు సంతోషంగా జీవించటానికి ఇది అనుకూలమైన సమయం.

ఇక మకర రాశి వారు మకర రాశి లోనే ఏర్పడే లక్ష్మీ యోగం వల్ల మంచి ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. వారు పట్టిందల్లా బంగారమే అవుతుంది. ప్రేమ, సామరస్యం, అవగాహనతో గుర్తించబడిన, అభివృద్ధిచెందుతున్న వైవాహిక జీవితాన్ని చూస్తారు. ఆదాయంలో పెరుగుదలకు మంచి అవకాశం ఉంది. లక్ష్మీదేవి ఆశీస్సులతో వారు చేసే ప్రతి పనిలో విజయం సాధిస్తారు.

కర్కాటక రాశి వారు లక్ష్మీ యోగం కారణంగా గణనీయమైన ఆర్థిక లాభాలను చూస్తారు. ఆదాయంలో విపరీతమైన పెరుగుదల కనిపిస్తుంది. సంపన్నమైన కాలం ముందు ముందు వారికి గోచరిస్తుంది. లక్ష్మీ యోగం కారణంగా వీరిలో ఉన్న ఉత్తమ లక్షణాలు బయటకు వస్తాయి. వీరు తమ అద్భుతమైన ప్రవర్తనతో అప్రయత్నంగానే ప్రజలను తమవైపు ఆకర్షిస్తారు. మంచి అర్థవంతమైన సంబంధాలను ఏర్పరచుకొని, సమాజంలో మంచి పలుకుబడితో జీవిస్తారు.

కన్యా రాశి వారు తమ జాతకంలో అనుకూలమైన ఫలితాలను పొందుతారు. వారు పెట్టే ప్రతి పెట్టుబడిలోనూ మెరుగైన లాభాలను పొందుతారు .ఆర్థిక స్థిరత్వం కలుగుతుంది. ఈ సమయంలో ఏ పని చేసినా కలిసొస్తుంది. జీవిత భాగస్వామితో సంబంధాలు మెరుగవుతాయి సంతృప్తికరమైన జీవితాన్ని సంతోషంగా గడుపుతారు.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+