Astrology: అక్టోబర్ 1నుండి 3వతేదీ వరకు వరుసగా ముఖ్యగ్రహాల రవాణా.. అన్ని రాశులపై ప్రభావం!!

2023 సంవత్సరం అక్టోబర్ మాసానికి చాలా ప్రాధాన్యత ఉంది. ఈ మాసంలో మన అనేక ముఖ్యమైన పండుగలు జరుగుతాయి. అంతేకాదు ఈ మాసంలో అనేక కీలక గ్రహాల సంచారం ప్రాధాన్యతను సంతరించుకుంది. మనిషి జీవితం పైన ప్రభావం చూపించే గ్రహాల సంచారం అక్టోబర్ నెలలో కీలకం కానుంది. అన్ని రాశులపైన ప్రధాన గ్రహాల సంచార ప్రభావం పడనుంది.

ఇక అక్టోబర్ నెలలో గ్రహాల సంచారం ఏ విధంగా ఉంటుంది?ఏ గ్రహం ఏ రాశిలో కి ఎప్పుడు ప్రవేశిస్తుంది? వంటి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా అక్టోబర్ నెలలో అక్టోబర్1 వ తేదీ నుండి 3వ తేదీ వరకు ముఖ్యమైన గ్రహాల రవాణా జరగనుంది. ఇది ద్వాదశ రాశుల వారి జీవితాలపైన ప్రభావం చూపిస్తుంది.

Astrology:

అక్టోబరు ఒకటవ తేదీన కన్యారాశిలో బుధ గ్రహం సంచరించడం ఉంది. అక్టోబర్ రెండవ తేదీన సింహరాశిలో శుక్రుడు సంచరించనున్నాడు. అక్టోబర్ మూడవ తేదీన తులారాశిలో అంగారకుడు సంచరించనున్నాడు. వేద జ్యోతిషశాస్త్రంలో ముఖ్యమైన గ్రహాలుగా పరిగణించబడే ఈ గ్రహాల సంచారం మేష రాశి నుండి మీన రాశి వరకు మొత్తం 12 రాశుల వారి జీవితాలలో గణనీయమైన మార్పులను తీసుకువస్తుంది.

మూడు రోజుల్లో జరగనున్న ముఖ్యమైన మూడు గ్రహాల సంచారం వల్ల కొన్ని రాశులకు లబ్ది జరిగితే, మరికొన్ని రాశులు ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. గ్రహాల గమనం వివిధ రాశుల వారి జాతకాల పైన మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అనేక పరిణామాలకు కూడా కారణంగా మారుతుంది.

ఇదిలా ఉంటే అక్టోబర్ మాసంలో అక్టోబర్ 18వ తేదీన తులారాశిలో సూర్య సంచారం జరగనుంది. అక్టోబర్ 19వ తేదీన తులారాశిలో బుధ సంచారం జరగనుంది. అక్టోబర్ 31వ తేదీన రాహు కేతువుల సంచారం జరగనుంది.ముఖ్యమైన గ్రహాలూ, నీడ గ్రహాలూ ఈ మాసంలో సంచారం చెయ్యటం వలన కొన్ని ముఖ్యమైన యోగాలు కూడా ఏర్పడనున్నాయి. కొన్ని యోగాలు శుభ యోగాలు కాగా, మరికొన్ని యోగాలు అశుభ యోగాలుగా చెప్పొచ్చు.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+