శుక్రుడి దయతో మార్చి వరకు ఈ రాశులవారికి గోల్డెన్ డేస్.. మీరున్నారా!!
వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనం ద్వాదశ రాశుల వారి జీవితాలపైన గణనీయమైన ప్రభావాన్ని చూపిస్తుంది. ఫిబ్రవరి నెలలో ఐదు పెద్ద గ్రహాలు రాశులను మార్చుకుంటూ ఉండటంతో, అంతేకాక ఒకే రాశిలోకి ప్రధాన గ్రహాలు వస్తున్న క్రమంలో అనేక రాజయోగాలు కూడా ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా శుక్రుడి ప్రభావం అన్ని రాశులపైన ఉంటుంది.
శుక్ర సంచారం : జాతకంలో శుక్రుడు శుభ స్థానంలో ఉంటే ఆ వ్యక్తి జీవితంలో ఎటువంటి లోటు ఉండదు. సంపద, విలాసాలు, వినోదాలతో వ్యక్తి జీవితాన్ని సంతోషంగా గడుపుతాడు ప్రస్తుతం ధనస్సురాశిలో ఉన్న శుక్రుడు ఫిబ్రవరి 12వ తేదీన మకరరాశిలోకి ప్రవేశించ బోతున్నాడు. మార్చి 5వతేదీ వరకు శుక్రుడు మకరరాశి లోనే ఉండబోతున్నాడు. మకరరాశిలో శుక్రుడి సంచారం వల్ల కొన్ని రాశులవారికి అదృష్టం కలిసి వస్తుంది. ఈ సమయంలో లక్ష్మీదేవి కటాక్షం మెండుగా ఉంటుంది.

మేష రాశి : మేషరాశి వారికి శుక్రుడి సంచారం అదృష్టాన్ని తెస్తుంది. వర్తక వ్యాపారాలు చేసే వారికి, ఈ సమయంలో చేసుకునే వ్యాపార ఒప్పందాలు సత్ఫలితాలను ఇస్తాయి. మేషరాశి వారికి ఈ సమయంలో సంపద గణనీయంగా పెరుగుతుంది. మేషరాశి జాతకులు జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. మేష రాశి జాతకులకు ఈ సమయం ఆర్థికంగా పుంజుకోవడానికి అవకాశం ఇస్తుంది. ధార్మిక కార్యక్రమాలలో కూడా ఈ సమయంలో పాల్గొంటారు.
కర్కాటక రాశి : కర్కాటక రాశి వారికి శుక్ర సంచారం మంచి ఫలితాలను ఇస్తుంది. కర్కాటక రాశి జాతకులకు ఈ సమయంలో శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. జీవితం సంతోషదాయకం గా ఉంటుంది. వాతావరణం సుఖశాంతులతో ఆహ్లాదకరంగా ఉంటుంది. ఆదాయాన్ని పెంచుకోవడానికి కొత్త మార్గాలు మీకు కనిపిస్తాయి. కొత్త ఉద్యోగ అవకాశాలు ఈ సమయంలో రావచ్చు.
మకర రాశి : శుక్ర సంచారం కారణంగా మకరరాశి వారికి మహర్దశ రాబోతుంది. పెద్ద గ్రహాలన్నీ మకరరాశిలోనే కలుసుకోబోతున్న క్రమంలో మకరరాశి వారికి ఈ సంచారం శుభప్రదంగా మారుతుంది. ఈ సమయంలో ఉద్యోగ అవకాశాల కోసం చూస్తున్న వారికి మంచి ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి. ఆర్థికంగా స్థిరపడే సమయం. ఈ సమయంలో ఆరోగ్యం బాగుంటుంది. మకర రాశి జాతకులకు కుటుంబంతో కలిసి సరదాగా ట్రిప్ కు వెళ్లే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో ఈ సమయంలో సంతోషంగా గడుపుతారు.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.
-
today rashiphalalu: శ్రీరామనవమి నాడు వీరికి నవవిధ శుభాలు ప్రసాదించిన అద్భుత యోగాలు -
శ్రీరామనవమి నాడు రెండు విశేషయోగాలు.. వీరికి ఊహించని ధనలాభం! -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
వాస్తు అనేది నిజమేనా? ఎందుకు దాన్ని ఫాలో అవ్వాలి? -
ఏప్రిల్ లో బుధ గోచారంతో ఈ రాశులవారికి గడ్డుకాలం! -
today rashiphalalu:మీనరాశిలో ఆ గ్రహాల కూటమి.. మీకే సంపదల వెల్లువ! -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు












Click it and Unblock the Notifications